NewsOrbit
న్యూస్

అమరావతి రైతులకు సిపిఐ మద్దతు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి నుండి విశాఖకు తరలించే హక్కు సిఎం జగన్‌కు లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం ఆయన సిపిఐ నేతల బృందంతో మందడం, పెనుమాక రైతుల నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శంచి సంఘీభావం తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ నియంతృత్వ పోకడల వల్ల 29 గ్రామాల ప్రజలు కన్నీరు పెట్టకుంటున్నారని ఆయన అన్నారు. జగన్‌కు ధైర్యం ఉంటే అమరావతి అంశం పై రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.మూడు రాజధానులు అంటే అందరూ నవ్వుకుంటున్నారని అన్నారు.రాజధాని ప్రాంత రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ఈ విషయాన్ని అవసరం అయితే కేంద్రం దృష్టికీ తీసుకువెళతామనీ హామీ ఇచ్చారు. జగన్ కేబినెట్‌లో మంత్రులు అందరూ పరమానందయ్య శిష్యులుగా వ్యవహరిస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. బస్టాండ్‌, సినిహా హాళ్లలో గొడవలు పడుతూ తిరిగే వారంతా చట్ట సభలకు ఎన్నికై మంత్రులు అయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరగబడిందని అన్నారు.

అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పక్షాలు అమరావతి రైతాంగానికి అండగా ఉన్నారని చెప్పారు. రైతాంగానికి అన్యాయం జరుగుతుంటే సిపిఐ చూస్తూ ఊరుకోదని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నారాయణ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు.

సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని మార్పు గురించి ఎన్నికలకు ముందు జగన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కమిటీలు చెప్పాయని రాజధాని మార్చడం ఏమిటని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎటువంటి భద్రత లేకుండా రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా తిరిగిన జగన్ నేడు తాడేపల్లి నుండి పోలీసు భద్రత లేకుండా నాలుగు అడుగులు వేయగలరా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఎందుుకు వచ్చిందో ఆర్థం చేసుకోవాలన్నారు. రాజధాని ప్రాంతం ఎడారి, శ్మశానం అంటూ వ్యాఖ్యలు చేస్తున్న వారు శ్మశానంలో ఎడారిలో వందలాది మంది పోలీసులను ఎందుకు దింపారని ప్రశ్నించారు.

ఒ కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అనే ముద్ర వేస్తారనీ అదే మాదిరిగా రాజధాని అమరావతిని చంపేందుకు ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ మంత్రులు మాట్లాడుతున్నారని అన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు అయ్యింది, ఇప్పటి వరకూ ఏమి చేశారంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఒక్కరి మీద అయినా కేసు నమోదు చేశారా, కోర్టుకు ఈడ్చారా, అరెస్టు చేశారా అని రామకృష్ణ ప్రశ్నించారు. అమరావతిపై పోరాటానికి 18న కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. 20వ తేదీ నుండి ప్రత్యేక సమావేశాల సందర్భంలో చలో అసెంబ్లీకి తమ పార్టీ పిలుపు ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని రామకృష్ణ తెలిపారు.

Related posts

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

Leave a Comment