NewsOrbit
రాజ‌కీయాలు

విజయవాడలో గ్యాంగ్ వార్ కేసు- గుంటూరు లో టాప్ సీక్రెట్ తెలిసింది!

విజయవాడ గ్యాంగ్ వార్ లో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోడూరు మణికంఠ వార్డు సమీపంలో ఒక అజ్ఞాత వ్యక్తి సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

అయితే అతడు పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం అందింది. మణికంఠ కు హాని చేసే ఉద్దేశ్యంతో అతను వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మణికంఠ చికిత్స పొందుతున్న వార్డు దగ్గర, పటిష్ట బంధోబస్తు ఏర్పాటు చేసారు.ఇదిలా ఉండగా ఈ గ్యాంగ్ వార్ కు సంబంధించి మొత్తం 13 మందిని అరెస్టు చేసినట్లువిజయవాడ సీపీ ద్వారక తిరు మల రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. హతుడు తోట సందీప్ కు, కోడూరు మణికంఠకు రాజకీయంగా సంబంధాలున్నా, జరిగిన ఘటనలో రాజకీయ నాయకుల జోక్యం లేదని ఆయన ప్రక టించారు. అయినా ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై నిఘా పెడుతున్నట్లు ఆయన స్పష్టం చేసారు. సీపీ చెప్పిన కథనాన్ని అనుసరించి హతుడు సందీప్, పండు మంచి స్నే హితులు. యనమలకుదురు లోని ఒక స్థల వివాదంలో ఈ ఇద్దరూ చెరొక వైపు సెటిల్మెంట్ లో పాల్గొనడం ఘర్షణకు దారితీసింది .ఒక స్థలంలో ప్లాటుకు సంబంధించి ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డి నడుమ వివాదాలున్నాయన్నారు. స్థిరాస్తి వ్యాపారంతో పాటు, సెటిల్మెంట్లు చేసే ట్రాక్టరు డీలరు నాగబాబు దగ్గరకు ఈ వ్యవహరం సెటిల్మెంటుకు చేరింది. దీంతో నాగబాబు తనతో సత్సం బంధాలున్న తోట సందీప్ ను ఈ విషయంలో సహకరించాలని కోరాడు, ఈ వ్యవహరమై ఈ నెల29న నాగబాబుకు చెందిన పెనమలూరులోని తన మిత్రుని స్థలంలో వంచాయతీ పెట్టారు.దీనికి పండు ప్రదీప్ తరుపున హాజరయ్యారు. ఇది నచ్చని సందీప్ పండుకు ఫోన్ చేసి బెదిరిం చాడు. అనంతరం వివాదం ముదిరి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకొనగా తోట సందీప్ మృతి చెందాడు. మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. డీసీపీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఆరు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం గాలించి 13 మందినిఅరెస్ట్ చేశారు. ఇకపై విజయవాడలో గ్యాంగ్ వార్లు, ఘర్షణలు పునరావృ తమైతే కఠినచర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు



Related posts

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju