NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ambati Rayudu – Pawan Kalyan: అంబటి రాయుడూ ఏమిటీ ట్విస్ట్ ..? మరలా యూటర్న్‌ తీసుకుంటున్నారా..?

Ambati Rayudu – Pawan Kalyan: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ట్విస్ట్ ఇచ్చారు. అంబటి రాయుడు వైసీపీలో చేరిన పది రోజుల వ్యవధిలోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ మరుసటి రోజే  వైసీపీకి రాజీనామా చేయడానికి కారణాన్ని కూడా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు అంబటి రాయుడు. క్రికెట్ ఆడటం కోసం రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

త్వరలో దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ టీ 20 లీగ్ లో ఆడనున్నట్లు వెల్లడించారు. ప్రొఫెషన్ క్రికెట్ లీగ్ లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదని వెల్లడించారు. అయితే అనూహ్యంగా ఇవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఇరువురి మధ్య దాదాపు గంటకు పైగా చర్చలు జరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ కావడంతో మరల యూటర్న్ తీసుకున్నారా అనే ప్రశ్న ఉదయిస్తొంది. రాబోయే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభకు పోటీ చేయాలన్న ఆలోచనతోనే అంబటి రాయుడు గత కొంత కాలంగా నియోజకవర్గ పరిధిలో పర్యటనలు చేశారని టాక్ నడుస్తొంది. వైసీపీ అధిష్టానం కూడా గుంటూరు పార్లమెంట్ స్థానంపై హామీ ఇవ్వడంతోనే వైసీపీలో చేరారని ప్రచారం జరిగింది. అయితే నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ను గుంటూరు లోక్ సభ స్థానం నుండి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచిస్తున్న నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన వైసీపీని వీడుతున్నట్లు అంబటి రాయుడు ప్రకటించారు.

Ambati Rayudu

పవన్ తో అంబటి రాయుడు భేటీలో రాజకీయ ప్రాధాన్యత ఉందా లేదా అనేది తెలియాలి అంటే వారి నుండి ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే. వీరి భేటీకి సంబంధించి అటు జనసేన పార్టీ గానీ, ఇటు అంబటి రాయుడు గానీ అధికారింగా ఎటువంటి సమాచారం విడుదల చేయలేదు. అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరనున్నట్లుగా సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది.

YSRCP: రాజ్యసభకు ఆ ముగ్గురు .. వైవీతో పాటు ఆ ఇద్దరికీ ఛాన్స్..?

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N