NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Elections: న్యూస్ ఆర్బిట్ స్పెషల్ ఎనాలసిస్ : ముందస్తు ఎన్నికలు వస్తే ఏపీ cm ఎవరు ?

Advertisements
Share

AP Elections: దేశంలో, రాష్ట్రంలో ఇప్పుడు ముందస్తు ఎన్నికలు అంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. ఏపీలో ఎప్పటి నుండో ముందస్తు ఎన్నికలు అంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడటం, అధికార వైసీపీ ఆ వ్యాఖ్యలను ఖండించడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ జమిలి ఎన్నికలు అంటూ ప్రచారం జరుగుతోంది. అసలు ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరికి ప్రయోజనం..అధికార పక్షానికా.. లేక ప్రతిపక్షానికా అనే చర్చ జరుగుతుంది. సాధారణంగా ముందస్తు ఎన్నికలు అంటే అది అధికార పార్టీయే ముందుగా రంగం సిద్దం చేసుకుంటుంది. అసెంబ్లీని రద్దు చేసి ప్రజల తీర్పు కోరే అవకాశం అధికార పార్టీకి మాత్రమే ఉంటుంది. అలా ముందస్తు ఎన్నికలకు వెళ్లి దేశంలోని చాలా రాజకీయ పార్టీలు లబ్ది పొందాయి. మరి కొన్ని తిన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కాన్వాయ్ పై మవోయిస్టు బాంబ్ దాడి జరిగిన నేపథ్యంలో సానుభూతి వర్క్ అవుట్ అవుతుందని భావంచి ఆనాడు చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఉపయోగం కలగలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది.

Advertisements

 

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అయిదేళ్ల క్రితం ముందస్తు ఎన్నికలకు వెళ్లి వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్దంగా లేని సమయంలో అధికార పక్షం అంతర్గతంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లి లాభపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ ముందస్తు వెళ్లే ఆలోచన చేస్తుందా అనే దానిపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందస్తు ఎన్నికలు అంటోంది. ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలను చూసుకుని ముందస్తు ఎన్నికలను నిర్వహించాలని భావిస్తొందని అంటున్నారు. ఏపీలో పరిస్థితి చూసుకుంటే షెడ్యుల్ ప్రకారం ఎన్నికలకు మరో ఎనిమిది నెలలకుపైగా సమయం ఉంది. కావున ఈ లోపుగా చేయాల్సిన పనులు మొత్తం నెమ్మదిగా పూర్తి చేసుకోవడంతో పాటు కొత్త ఏడాదిలో మరి కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తొంది.

Advertisements

 

అయితే కేంద్రంలోని బీజేపీ కారణంగా దేశంలో ఎన్నికలు ముంచుకు వచ్చే పరిస్థితి ఉంది. లోక్ సభతో పాటు ఏపీ వంటి పది పన్నెండు రాష్ట్రాలను ఒప్పించి మినీ జమిలీ ఎలక్షన్స్ జరిపించాలని బీజేపీ భావిస్తుందని అంటున్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, సమయం కలిసి వస్తుంది అని చెప్పడం వారి ఉద్దేశం. షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు అంటే ఓటమి ఎదురవుతుందన్న భయంతోనే జమిలి విధానం ముందుకు తీసుకువచ్చారని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ముందస్తు (వన్ నేషన్ – వన్ ఎలక్షన్) అంటే ఏపీలోని అదికార వైసీపీకి ఇష్టం లేకపోయినా ఒకే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే .. ఎన్డీఏలో వైసీపీ మిత్రపక్షం కాకపోయినప్పటికీ అనధికారికంగా స్నేహం చేస్తూనే ఉంది. మరి తెలంగాణతో పాటు ఏపీలోనూ డిసెంబర్ లోనే ఎన్నికలు అంటే అధికార వైసీపీకి ప్లస్ అవుతుందా లేదా మైనస్ అనే చర్చ జరుగుతోంది.

 

ఏపీలో చూస్తే ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కి ఉంది. అధికార వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో జనాల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వివిధ కార్యక్రమాల పేరుతో జనాల్లోనే ఉంటుంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార కార్యక్రమాల్లోనే పొలిటికల్ స్పీచ్ ఇచ్చేస్తున్నారు. విపక్షాలను తూర్పారబడుతున్నారు. మరో పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి, ఉమ్మడి విశాఖలో వారాహి యాత్ర చేపట్టారు. పార్టీల మధ్య పొత్తుల గురించి కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఎన్నికలకు వెళితే విపక్షాలకు ఎంత వరకు ఉపయోగం ఉంటుందనేది వైసీపీలో చర్చ జరుగుతోంది. ఇక అధికార వైసీపీకి ఎన్నికల ప్రచార విషయానికి వస్తే స్టార్ కాంపెయినర్లు ఎవరు ఉండకపోవచ్చని అంటున్నారు. నేరుగా సీఎం జగన్ యే జనాల్లోకి వెళ్లాలి. గత ఎన్నికల సమయంలో జగన్ తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, మోహన్ బాబు లాంటి పలువురు ప్రముఖ సినీ నటులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

మరో పక్క ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత ఏ మేరకు ఉంది. దాని ఎలా సరి చేసుకోవాలి. ఏయే వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు.. ఎమ్మెల్యేలలో ఎంత మందిపై వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం ఏ మేరకు ఉంది తదితర విషయాలన్నీ పరిశీలన చేసుకుని తదనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అధికార వైసీపీలో ఉంది. ఇవన్నీ ముందస్తు అంటే ఈ సమయం సరిపోతుందా అనేది చూసుకోవాలి. మరో పక్క వైసీపీకి కలిసి వచ్చే అంశం ఏమిటంటే .. విపక్షాల్లో ఇంకా అయోమయంలో ఉండటం, పొత్తులు అంటున్నారు కానీ ఆ వ్యవహారాలు కొలిక్కి రాకపోవడం. ఎవరు ఎవరితో పొత్తులో ఉంటారు అనేది ఇంకా తేలలేదు. బీజేపీ తమ మిత్ర పక్షం జనసేన అంటోంది. జనసేన ఏమో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని అంటోంది. అందుకు బీజేపీ అధిష్టానం ఇంత వరకూ ఏమీ తేల్చలేదు.

పొత్తు వల్ల టీడీపీకి లాభం అనుకుంటున్నా నష్టం కూడా ఉందని మరి కొందరు వాదిస్తున్నారు. పొత్తుల కారణంగా టికెట్లు కోల్పోయే ఆశావహులు రెబల్స్ గా మారే పరిస్థితి ఉంటుంది. పొత్తులు ఉన్నా ఓట్ల బదిలీ సరిగ్గా జరుగుతుందా లేదా అన్న సందేహాలు ఉన్నాయి. ఒక వేళ పొత్తులు పెట్టుకున్నా ఓట్ల బదిలీ జరగకపోతే అసలుకే ఎసరు వస్తుందని అంటున్నారు. ఇలా విపక్షాలు ఇబ్బందిపడితే అది అధికార వైసీపీకి మేలు అవుతుందని భావిస్తొంది. త్రిముఖ పోటీ జరిగితే మాత్రం అది అధికార వైసీపీకే అడ్వాంటేజ్ అవుతుందన్న మాట వినబడుతోంది. అందుకే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలను దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటూ అధికార వైసీపీ నేతలు సవాల్ చేస్తూ రెచ్చగొడుతున్నారని అంటున్నారు. ప్రజలు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తారో చూడాలి మరి.

YS Viveka Case: వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు హైకోర్టులో బిగ్ షాక్ .. బెయిల్ పిటిషన్ లు తిరస్కరణ

 


Share
Advertisements

Related posts

వికేంద్రీకరణ సమర్థిస్తూ రావులపాలెంలో ర్యాలీ

somaraju sharma

Breaking: త్రిపురలో కీలక రాజకీయ పరిణామం .. ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా

somaraju sharma

రేవంత్ రెడ్డి బీజేపీలోకి పట్టుకురండి మోడీ అత్యవసర ఆదేశాలు..??

sekhar