AP CID: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఏపీ సీఐడీ అధికారుల బృందం జూబ్లీహిల్స్ లోని రామోజీరావు నివాసానికి వెళ్లింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఎండీ శైలజా కిరణ్ ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. చందాదారుల నగదును ఎక్కడికి మళ్లించారు అన్న కోణంలో ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తొంది. చిట్ ఫండ్ నగదును రామోజీ గ్రూప్ కంపెనీలకు మళ్లించినట్లుగా సీఐడీ అధికారులు పేర్కొంటున్నారు. మార్గదర్శి కేసులో ఇప్పటికే ఆ సంస్థకు సంబంధించి రూ.798.50 కోట్ల విలువైన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. ఇంతకు ముందు కూడా సీఐడీ బృందం.. రామోజీరావు, శైలజా కిరణ్ లను విచారించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురుని ఏపీ సీఐడీ అరెస్టు చేయగా, యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, మద్యంతర ఉత్తర్వులు న్యాయస్థానం జారీ చేసింది.

మరో పక్క మార్గదర్శ చిట్ ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్లను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్ధ లుత్రాలు వాదనలు వినిపించగా, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇతరత్రా అంశాలపై తదుపరి విచారణలో పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.
AP CM YS Jagan Polavaram Tour: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం వైఎస్ జగన్