GIS: విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పూర్తి అయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు. వనరులు, పరిస్థితులను దేశ విదేశాల నుండి వచ్చిన పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం వివరించింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సదస్సు విజయంతం చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యావాదాలు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఏపి ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలకు అభినందనలు తెలియజేశారు. మొత్తం 15 రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్.. సదస్సు విజయవంతం అవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఏపి ఆర్ధికంగా ముందుకు వెళ్తొందనీ, నూతన పారిశ్రామిక విధానం తీసుకువచ్చామని తెలిపారు. ఏపిని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతామని సీఎం చెప్పారు. అభివృద్ధి పథంలో దూసుకువెళుతూ కోవిడ్ కష్టాలను కూడా అధిగమించామన్నారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ అండగా నిలిచామని చెప్పారు.

ఇప్పుడు కీలక సమయంలో జీఇఎస్ నిర్వహించామన్నారు సీఎం జగన్. పారదర్శక పాలనతో విజయాలు సాదిస్తున్నామని పేర్కొన్నారు. జీఇఎస్ ద్వారా 15 సెక్టార్ లో సెషన్స్ నిర్వహించామనీ, ఏపి అభివృద్ధికి ఈ 15 15 సెక్టార్లు అత్యంత కీలకమని అన్నారు. ఈ 15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయనీ, రెండు రోజుల్లో 352 ఎంవోయూలు జరిగాయన్నారు. వందకు పైగా స్పీకర్లు పాల్గొన్నారని చెప్పారు. యూఎఈ, వియత్నాం, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాలతో ప్రత్యేక కంట్రీ సెషన్స్ నిర్వహించామని అన్నారు. జీఇఎస్ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.13లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయన్నారు. దాదాపు 6లక్షల 3వేల 223 మందికి ఉపాధి అవకాశాలు దక్కినట్లు అవుతుందని చెప్పారు. మొత్తం పెట్టుబడుల్లో 8 లక్షల 84వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం ఎనర్జీ రంగంలో వచ్చాయన్నారు. గ్రీన్ ఎనర్జీతో భారత దేశ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్రయాణం కీలకమని అన్నారు. పర్యాటక రంగంలో 22వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపికి వచ్చాయని తెలిపారు.
కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి మాట్లాడుతూ జీఇఎస్ లో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. నైపుణ్యం కల్గిన మానవ వనరులు ఏపికి సొంతం అని, ప్రతిభ గల యువత ఏపిలో ఉన్నారన్నారు. ప్రపంచ ఆర్ధిక ప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్ ప్రకటించిందన్నారు. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. పలు కీలక రంగాల్లో కనెక్టివిటీ బాగా పెరిగిందన్నారు. నూతన భారత్ నిర్మాణం వేగంగా జరుగుతోందనీ, 2025 నాటికి ఇండియాలో 250 యూనికార్న్ సంస్థలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తొందని తెలిపారు. ఏపి ప్రగతికి చిత్తశుద్దితో కృషి చేస్తొన్న సీఎం జగన్ కు అభినందనలు అంటూ ప్రశంసించారు.
ఇప్పటం లో మరో సారి ఉద్రిక్తత .. ప్రహరీ గోడల కూల్చివేతలు