NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Government:  ఏపి ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ ..! ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు భరోసా..!!

AP Government: కరోనా నియంత్రణలో వైద్యులు, సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్మోహనరెడ్డి సర్కార్ వైద్యులు, సిబ్బందికి భరోసానిచ్చేందుకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ బారిన పడి మరణించిన వైద్యులు, సిబ్బంది కుటుంబాలకు భారీ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

AP Government key orders for health workers
AP Government key orders for health workers

కోవిడ్ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబాలకు రూ.25లక్షలు, స్టాఫ్ నర్స్ లకు రూ.20లక్షలు, ఎఫ్ఎన్ఒ, ఎంఎన్ఒలకు రూ.15లక్షలు, ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read More: Minister Buggana Rajendranath reddy: రాష్ట్ర మంత్రికి షాక్ ఇచ్చిన కేంద్ర భద్రతా సిబ్బంది..!సీఎంఒకు ఫిర్యాదు..!?

కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ (పీఎంజికే) పథకానికి అదనంగా ఈ ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. తక్షణమే ఎక్స్ గ్రేషియా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కోవిడ్ నిర్వహణలో భాగంగా కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ లలో పని చేసే డాక్టర్లు, సిబ్బంది అలాగే కోవిడ్ పాజిటివ్ ఉన్న ఇళ్లను సందర్శించే సిబ్బంది మరణిస్తే వారివారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను పొందడానికి అర్హులుగా తెలిపారు. మరే ఇతర పథకాల ద్వారా గానీ, ఇన్సూరెన్స్ ద్వారా గానీ లబ్ది పొందే వారు కూడా ఈ ఎక్స్ గ్రేషియా పొందేందుకు అర్హులేనని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

ప్రొహిబిషన్ డిక్లరేషన్ కోసం వేచి చూస్తున్న ఉద్యోగులు కూడా ఎక్స్ గ్రేషియా పొందేందుకు అర్హులుగా పేర్కొంది. కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ తో పాటు కోవిడ్ తో మరణించినట్లు దృవీకరణ పత్రం సమర్పిస్తే సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించిన తరువాత ఎక్స్ గ్రేషియాను ఆయా జిల్లాల కలెక్టర్ లు మంజూరు చేస్తారని ఉత్తర్వులో పేర్కొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju