ఏపిలో రాజధాని రగడ ఇప్పట్లో ముగిసేలా కనబడటం లేదు. ఓ పక్క అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు విచారణలో ఉంది. విశాఖ పరిపాలనా రాజధాని చేసి తీరుతామంటూ వైసీపీ నేతలు, మంత్రులు పదేపదే చెబుతున్నారు. ప్రతిపక్షాలు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడే ఉందని స్పష్టం చేస్తొంది. ఈ తరుణంలో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి.. అమరావతిని రాజధానిగా చేస్తే .. విశాఖను ప్రత్యేక రాష్ట్రంగా చేయ్యాలని అడుగుతామని పేర్కొన్నారు ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం జిల్లాలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్ లో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన ప్రసాదరావు.. ఉత్తరాంధ్ర ప్రజల కోసం తాను గొంతు ఎత్తడం ఆపనని స్పష్టం చేశారు. అవసరం అయితే ఎమ్మెల్యే, మంత్రి పదవిని వదిలివేస్తానని ప్రకటించారు.

ఏపీలో సభలు, సమవేశాలపై నిషేదం లేదు కానీ..
ఇదే క్రమంలో భూదందా ఆరోపణలను ధర్మాన ఖండించారు. తన రాజకీయ జీవితంలో ఒక్క పైసా తీసుకున్నానని నిరూపించినా రాజీనామా చేస్తానని ఎన్నో సార్లు చెప్పానన్నారు. బహిరంగ చర్చకు చంద్రబాబు వస్తారా అని సవాల్ విసిరానన్నారు ధర్మాన. తాను మంత్రిగా ఉన్నా ఒక్క సెంటు భూమి ఎవరికీ ఇవ్వలేననీ, కేబినెట్ మాత్రమే భూములను కేటాయించగలదని అన్నారు. తప్పు జరిగితే తాను ఎవరినైనా నిలదీస్తాననీ, అధికార పార్టీ అన్యాయం చేసినా ఊరుకోనని తెలిపారు. ఇది సైకో ప్రభుత్వమని అనడం శోచనీయమని అన్నారు ధర్మాన. తమ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదన్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు.
YS Jagan: ఆ శాఖలో పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్