NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Attack on Posani: పోలీస్ వాహనంలో పోసాని కృష్ణమురళి తరలింపు..! ఎందుకంటే..?

Attack on Posani: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి పై పవన్ కల్యాణ్ అభిమానులు దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. చిత్ర పరిశ్రమపై ఏపి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పోసాని పవన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పోసాని విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ అభిమానులు ఆయనకు వ్యక్తిగత ఫోన్ కు దుర్భాషలాడుతూ సందేశాలు పంపించడం, మాట్లాడటం చేశారు. దీంతో మరో సారి పోసాని రియాక్ట్ అయ్యారు.

Attack on Posani: serious comments on Pawan Kalyan
Attack on Posani serious comments on Pawan Kalyan

పవన్ అభిమానుల మాటలను తన కుటుంబపరువు తీసేలా ఉన్నాయని పోసాని ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ తన అభిమనులను అదుపులో పెట్టుకోవాలని మీడియా సమావేశంలో ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను జగన్ అభిమానిని, ఆయనను ఎవరేమన్నా భరించలేనని పోసాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతంలో పవన్ కళ్యాణ్ కు తనకు మధ్య జరిగిన ఓ గొడవ ను పోసాని మీడియాకు వివరించారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఘూటింగ్ సందర్భంలో జరిగిన ఘటనను వివరించారు. తన కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారంటూ ఆదే రీతిలో పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పోసాని మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పెద్ద ఎత్తున పవన్ అభిమానులు ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ముగిసిన తరువాత పోసాని వెళుతుండగా పవన్ అభిమానలు దాడికి యత్నించారు. ఆరుగురు పవన్ అభిమానులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుండి తరలించారు. మరి కొందరు కూడా అక్కడ గుమిగూడటంతో పోసానిని పోలీసులు తమ వాహనంలో ప్రెస్ క్లబ్ నుండి సురక్షితంగా తరలించారు. ఈ సందర్భంలో పోసాని మాట్లాడుతూ పవన్ అభిమానుల నుండి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. తనకు ఏమైనా జరిగితే పవన్ కళ్యాణ్ యే కారణమనీ, పవన్ కళ్యాణ్ పై రేపు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Read More:

1.Pawan Kalyan: వైసీపీ నేతల విమర్శలపై గ్రామ సింహాల గోంకారాలు అంటూ తనదైన స్టైల్ లో బదులిచ్చిన పవన్ కల్యాణ్..!!

2.Sarada pitham: విశాఖ శారదా పీఠం అయ్యవారికి జగన్ పై కోపం వచ్చింది..! ఎందుకంటే..?

3.Badvel By Poll: బద్వేలు వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన సజ్జల

author avatar
sharma somaraju Content Editor

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !