NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ఇది నిజంగా జగన్ సర్కార్‌కు బూస్టప్‌ ఇచ్చే వార్తే..!!

AP Govt: ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగడం లేదనీ, సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలు అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చేశారనీ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఘోరంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో జగన్మోహనరెడ్డి సర్కార్ పాలనకు కితాబు ఇచ్చేలా ఓ ప్రముఖ సంస్థ సర్వే నివేదికను వెల్లడించడం వైసీపీ శ్రేణులను ఆనందింపజేస్తున్నది. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల పనితీరును నిగ్గు తేల్చేందుకు ఇండియా టుడే సంస్థకు చెందిన మార్కెటింగ్ – డెవలప్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ) ద్వారా 2003 నుండి ఏటా సర్వే నిర్వహిస్తోంది. 2021కి గానూ ఈ ఏడాది జూలై నుండి నవంబర్ వరకూ దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టారు.

Bootstrap news to AP Govt
Bootstrap news to AP Govt

AP Govt: సమ్మిళిత అభివృద్ధిలో మొదటి స్థానం

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్ గ్రోత్) సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని ఆ సంస్థ వెల్లడించింది. అదే విధంగా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఏపి తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. గత ఏడాది ఏడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాల జాబితా 2018లో చంద్రబాబు హయాంలో పదవ స్థానంలో ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019 లో 8 వ స్థానం, 2020 (గత ఏడాది)7వ  స్థానం, ఈ ఏడాది 6వ స్థానంకు ఎగబాకింది. ఇండియా టుడే సంస్థ నిర్వహిస్తున్న ఈ సర్వేకు దేశ వ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడంతో ఏపి అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం శాచ్యురేషన్ విధానంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతోనే ఇది సాధ్యమైందని సర్వే నివేదకలో విశ్లేషించింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N