NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పొలిటికల్ ఎంట్రీపై అంబటి రాయుడు ఇచ్చిన క్లారిటీ ఇది..

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై గత కొంత కాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. పలు మార్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తో భేటీ కావడంతో వైసీపీలో చేరి గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినబడ్డాయి. అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలోనే సొంత జిల్లాలో అంబటి రాయుడు పర్యటిస్తూ యువతతో సెల్ఫీలు, పెద్దలతో ఫోటోలు దిగుతూ ప్రజలతో మమేకం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Ambati Rayudu

 

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పర్యటించిన అంబటి రాయుడు అమీనాబాద్ లోని మూలాంకరేశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పాటశాల విద్యార్ధులతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మవారి పుట్టిన గ్రామానికి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. విద్యార్ధులు ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుని చదవాలని సూచించారు. తాను గుంటూరు ఎంపీ పదవికి పోటీ చేస్తానంటూ వచ్చిన వార్తలు అన్నీ ఊహగానాలేనని అన్నారు. తాను ఇది వరకు సీఎం ను కలిశాననీ, కానీ రాజకీయాలు మాట్లాడలేదన్నారు.

తాను ప్రజా సేవ చేస్తానని కానీ, ఏ ప్లాట్ ఫామ్ నుండి అనేది త్వరలో చెబుతానని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు, రైతు సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు అంబటి రాయుడు. కాగా అంబటి రాయుడు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. త్వరలోనే అంబటి రాయుడు అమెరికా వేదికగా జరగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) లో పాల్గొననున్నారు.

చంద్రబాబు నీడ నుండి పవన్ బయటకు రావాలని సూచించిన లక్ష్మీపార్వతి

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju