NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

రోజులు బాలేవు రాజులకు దూరం అవుతావా జగన్!!

 

 

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్లుంది ఏపీ లోని ఇద్దరు మంత్రులు పరిస్థితి… మొన్నటికి మొన్న విజయనగరం జిల్లా రామతీర్థం లో జరిగిన రాముడి తల నరికివేత వివాదంలో… కాస్త ఎక్కువగా స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ ఆలయ చైర్మన్ అశోకగజపతి రాజు ఏం చేస్తున్నారంటూ మాట్లాడటమే కాకుండా… వెధవ అంటూ సంబోధించడం పెద్ద వివాదం అవుతోంది… ఇప్పటికే అదే జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సైతం గత మూడు రోజుల క్రితం పేకాట క్లబ్ విషయంలో మాట్లాడిన తర్వాత… సోమవారం గుడివాడలోని పెద్ద పేకాట క్లబ్ లో పోలీసులు పట్టుకోవడం ఎదురు తన్ని నేపథ్యంలో ఇప్పుడు వెల్లంపల్లి వ్యాఖ్యలు సైతం… అధికార పార్టీ కు ఎదురు తన్నే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పలుమార్లు ఎంపీగా కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు ఈ విషయంలో వెల్లంపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ క్షత్రియ సమాజం అంతా ఒకే తాటి పైకి వస్తోంది.

వారిని వద్దు అనుకుంటారా జగన్!!

ఆంధ్రప్రదేశ్ జనాభాలో క్షత్రియుల కమ్యూనిటీ బలం కొన్ని ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యం ఎక్కువ. అందులోనూ ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న క్షత్రియ సామాజిక వర్గం పలు రాజకీయ పార్టీలకు ఆర్థికంగానూ చేయూత అందిస్తోంది. సుమారు రెండు శాతం మేర వీరు ఓటింగ్ ఉన్నట్లు అంచనా. ఇప్పుడు క్షత్రియ కులానికి చెందిన అశోక్ గజపతిరాజు ను… అందులోనూ రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన, విజయనగరం రాజుగారిగది గుర్తింపు పొందిన అశోక్గజపతిరాజు సామాజికవర్గం ఎంతో గౌరవిస్తుంది. వివాదరహితుడిగా ఉన్న అశోక్గజపతిరాజు క్షత్రియ సామాజికవర్గం అందరు ఆయనను కుల పెద్ద గానే చూస్తారు. అలాంటి వ్యక్తిని దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న, రాజకీయాల్లోనూ జూనియర్ అయినా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇష్టానుసారం వ్యక్తిగత దూషణలు చేయడం ఇప్పుడు క్షత్రియ సామాజికవర్గంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

ప్రతి జిల్లా నుంచి క్షత్రియ సామాజిక వర్గం సంఘం తరపున ప్రతినిధులు సోషల్ మీడియా, మీడియా వేదికగా పలు ప్రెస్మీట్లు పలు కామెంట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడంతో ఇప్పుడు వెంటనే దీన్ని ఎలాగైనా చక్కదిద్దే ప్రయత్నం ప్రభుత్వం ఆరంభించిన తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తో భేషరతుగా మీడియా ముందుకు నడిపించేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది పెద్దది అవ్వకముందే క్షత్రియ సామాజికవర్గం వైసీపీ కి దూరంగా జరగకముందే… దీన్ని వెంటనే చక్కదిద్దాలని జగన్ వైసీపీ నాయకులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో మంత్రి వెల్లంపల్లి కి ప్రత్యేకంగా వైసిపి నాయకులు ఫోన్ చేసి దీనిపై వెంటనే మీడియా సమావేశం పెట్టాలని సూచించినట్లు తెలిసింది. దీంతో వెల్లంపల్లి త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి శత్రువులకు క్షమాపణ చెప్పే అవకాశం ఉంది.

బీజేపీ కి లాభమే!!

క్షత్రియ సామాజిక వర్గంలో కీలక మైన వ్యక్తులు ప్రస్తుతం బీజేపీ లోనే పనిచేస్తున్నారు. సినీ నటుడు కృష్ణంరాజు బీజేపీలోనే కొనసాగుతున్నారు. మరోపక్క నర్సాపురం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం బిజెపికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. గతంలో బిజెపి ఎంపీ గా పనిచేసిన గోకరాజు గంగరాజు బిజెపి కు అనుకూలమే. ఇలా క్షత్రియ సామాజిక వర్గం లో కీలకమైన వ్యక్తులను బిజెపికి దగ్గరి వారే. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో వీరి ప్రభావం బాగా ఎక్కువ. బెల్లంపల్లి ఇష్టానుసారం మాట్లాడడంతో ముఖ్యంగా నరసాపురం భీమవరం ఉండి ప్రాంతాల, వైసిపి నాయకులు వెంటనే దీనిపై బెల్లంపల్లి తో కౌంటర్ క్షమాపణ చెప్పించాలని వైసీపీ అగ్ర నాయకులకు సూచించినట్లు తెలిసింది. దీనివల్ల ఆర్ధికంగాను ఓట్లు పరంగానూ వైసీపీ నష్టపోయే పరిస్థితి వస్తుందని ఇక్కడ తాము చాలా ఇబ్బంది పడతామని బెల్లంపల్లి తో వెంటనే అశోక్గజపతిరాజు క్షమాపణలు చెప్పించడం అన్ని రకాల మేలు చెప్పినట్లు సమాచారం.

author avatar
Comrade CHE

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N