NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

ఐదేళ్ల నుంచి విశాఖ‌పైనే దృష్టి పెట్టాను. ఇక్క‌డ ప్ర‌తి ప్రాంతంపైనా అధ్య‌య‌నం చేశాను. ఇక్క‌డ నుంచి నామినేష‌న్ వేసి ఇంట్లో ప‌డుకుంటే చాలు గెలిచేస్తా. టికెట్ నాకే ఇస్తారు. అగ్ర‌నాయ‌కత్వంపై నాకు న‌మ్మ‌కం ఉంది` అని బీజేపీ రాష్ట్ర నేత జీవీఎల్ న‌ర‌సింహారావు పదే ప‌దే చెప్పిన విష‌యం తెలిసిందే. కానీ.. పొత్తులో భాగంగా ఈ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ విముఖ త వ్య‌క్తం చేసింది. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల్లోపోటీ చేసి ఓడిపోయిన‌ప్ప‌టికీ.. బాల‌య్య రెండో అల్లుడు భ‌ర‌త్‌కే అవ‌కాశం ఇచ్చింది.

ఇక‌, భ‌ర‌త్ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. అభివృద్ధిని వివ‌రిస్తున్నా రు. ఇది ఒక‌వైపు.. జ‌రుగుతున్న ప్ర‌క్రియ‌. మ‌రో వైపు.. జీవీఎల్ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిమాదిరిగా ప్ర‌య త్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికీ జీవీఎల్ దింపుడు క‌ళ్లెం ఆశ‌ల‌ను వ‌దులు కోలేదు. ఈ టికెట్ కోసం.. ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాలు.. గ‌తంలో ఎవ‌రూ కూడా చేసి ఉండ‌ర‌ని అంటున్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగాఉత్త‌రాది నాయ‌కుల‌కు ఆయ‌న చేసిన సేవ‌లు.. ఇత‌ర‌త్రా ప్ర‌యోజ‌నాల‌ను ఆయ‌న ఉటంకిస్తున్నారు.

ఉత్త‌రాది నేత‌ల‌తో జీవీఎల్ నిత్యం మంత‌నాలు చేస్తున్నారు. త‌న‌కు టికెట్ ఇచ్చేలా అధిష్టానం ద‌గ్గ‌ర మంచి పేరున్న ఉత్త‌రాదికి చెందిన వ్యాపార వేత్త‌ల‌తో జీవీఎల్ రాయ‌బారాలు చేస్తున్నారు. త‌న‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతున్నారు. బీజేపీ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి సంకేతాలూ ఇవ్వ‌లేదు. అయితే, ఇక్క‌డ జీవీఎల్ మ‌రో సూత్రాన్ని తెర‌మీదికి తెచ్చారు, ఎలానూ.. న‌ర‌సాపురం పార్ల‌మెంటు టికెట్‌ను టీడీపీ కోరుతున్న నేప‌థ్యంలో దీనిని ఇచ్చేసి విశాఖ తీసుకోవాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌తిపాద‌న‌.

అయితే.. దీనికి టీడీపీ ఒప్పుకొనే ప‌రిస్థితి లేదు. న‌ర‌సాపురం ప్లేస్‌లో తంబ‌ళ్ల‌ప‌ల్లి అసెంబ్లీ స్థానం కానీ, ఉండి అసెంబ్లీ స్థానం కానీ.. ఇస్తామ‌ని చెబుతూ వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు దీనిపై బీజేపీ అధిష్టానం ఇంకా ఏమీ తేల్చ‌లేదు. కానీ, జీవీఎల్ మాత్రం ప‌ట్టు బ‌డుతున్నారు. విశాఖ‌పై బెట్టు కూడా వీడ‌డం లేదు. అయితే.. బీజేపీ మాత్రం మాట మాత్రంగా ఆయ‌నను ఊర‌డించ‌డం లేదు. దీంతో క్షేత్ర‌స్థాయిలో విశాఖ‌ల‌లో టీడీపీకి బీజేపీ దూర‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?