NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

రెండే రోజులు.. రెండంటే రెండే రోజులు.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యేందుకు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ నెల 18న ఏపీ స‌హా.. ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘంనోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నుంది. ఇక‌, అప్ప‌టి నుంచి ఐదు రోజుల్లో.. నామినేష‌న్ల ప‌ర్వం కూడా ప్రారంభం కానుంది. క‌ట్ చేస్తే.. ఈ ప‌రిణామంలో వైసీపీ క్లారిటీగానే ఉంది. అంటే.. మొత్తం 175 అసెంబ్లీ, పాతిక పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసుకుంది.

కానీ, ఎటొచ్చీ.. కూట‌మి పార్టీల్లోని టీడీపీలో మాత్రం గంద‌ర‌గోళం చింద‌ర‌వంద‌ర‌గానే కొన‌సాగుతోంది. ఇప్ప‌టికీ క‌నీసంలో క‌నీసం 5 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు కొన‌సాగుతున్నా యి. తిరువూరులో అభ్య‌ర్థి ని మార్చే ప్ర‌య‌త్నం కొన‌సాగుతోంది. పోనీ.. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన అభ్య‌ర్థికి టికెట్ ఉంద‌ని చెబుతున్నారా? అంటే.. అది కూడా చేయ‌డం లేదు. ఇక‌, ఇక్క‌డి టికెట్ ఆశించిన జ‌వ‌హ ర్ కూడా.. 18 వ‌ర‌కు వేచి చూసి నిర్ణ‌యంప్ర‌క‌టించే యోచ‌న‌లో ఉన్నారు.

అదేవిధంగా ఇటీవ‌ల టీడీపీలో చేర్చుకున్న వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ప‌రిస్థితి కూడా అగ మ్య గోచ‌రంగా ఉంది. ఆయ‌న‌కు టికెట్ ఇస్తారా? లేదా? అనేది ఇప్ప‌టికీ తెలియ‌దు. పోనీ.. టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉంటే.. అది ఉండా? ఉంగుటూరా? న‌ర‌సాపుర‌మా? అనేది కూడా స్ప‌ష్ట‌త‌లేదు. దీంతో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు డోలాయ‌మానంలో ప‌డ్డారు. త‌మ ప‌రిస్థితి ఏంట‌ని వారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. దీంతో ప్ర‌చార జోరు కూడా క‌నిపించ‌డం లేదు.

ఇక‌, రాజంపేట పార్ల‌మెంటు స్థానంలోనూ బీజేపీకి ఇబ్బందులు ఉన్నాయి. ఈ సీటును త‌న‌కు ఇచ్చి.. ఎమ్మెల్యే సీటును మార్చాల‌ని.. సీనియ‌ర్ నాయ‌కుడు ఆదినారాయ‌ణ‌రెడ్డి కోరుతున్నారు. ఇక‌, విశాఖ‌లో నూ త‌న‌కు సీటు కావాల‌ని జీవీఎల్ ప‌ట్టుబ‌డుతున్నారు. జ‌న‌సేన‌లోనూ.. తిరుప‌తి పంచాయ‌తీ ఇంకా తెగ‌లేదు. మ‌రోవైపు.. పాల‌కొండ‌లో జ‌న‌సేన నాయ‌కురాలు భూదేవి సెగ‌లు క‌క్కుతున్నారు.

త‌న‌కు టికెట్ ఇస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. టీడీపీ నుంచి వ‌చ్చిన నిమ్మ‌క జ‌య‌కృష్ణ‌కు ఇవ్వ‌డం ఏంట‌ని నిప్పులు చెరుగుతున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీకి సై అంటున్నారు. మొత్తంగా చూస్తే.. కూట‌మి పార్టీ ల్లోనామినేష‌న్ల‌కు ముందే ఈ వివాదాలు ప‌రిష్కారం అవుతాయా? లేక‌.. త‌ర్వాత పంచాయితీలు జ‌రుగుతా యా? అనేది ఆస‌క్తిగా మారింది.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?