NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Janasena Party: టీడీపీకి స్వీట్ వార్నింగ్ ..! వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ..!?

Janasena Party: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటల్లో చాలా స్పష్టమైన సంకేతాలు, కొన్ని అంతరార్ధాలు ఉన్నాయి. అవి ఏమిటి..? ఆయన ఉద్దేశం ఏమిటి..?జనసేన లక్ష్యాలు ఏమిటి..? అనేది పరిశీలిస్తే.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వమని మళ్లీ స్పష్టంగా పవన్ చెప్పారు. ఆ మాట ఆలోచించే అన్నాను, రాజకీయ వ్యూహంతో అనలేదు అని పేర్కొన్నారు. దీనితో పాటు ఒకరి పల్లకీలు మోయడానికి నేను లేను అని చెప్పారు. ఆ మాట అన్నారు అంటే తాను వైసీపీ ఓట్ల చీలనివ్వకుండా చేసి టీడీపీకి సపోర్టు చేసి వాళ్లను పల్లకీ ఎక్కించేందుకు సిద్ధంగా లేను అని టీడీపీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బేషరతుగా టీడీపీకి మద్దతు ఇచ్చి అధికారాన్ని చేతిలో పెడతాము అని అనుకోవద్దు అన్నట్లుగా ఓ సందేశం ఇచ్చారు.

Janasena Party chief Pawan Kalyan indirect warning to TDP
Janasena Party chief Pawan Kalyan indirect warning to TDP

Read More: TDP Janasena: ఆ పొత్తులపై టీడీపీలో భయం భయం..! జనసేనతో పేచీలు టీడీపీ టెన్షన్..!?

Janasena Party: “పవర్ షేరింగ్” అర్ధంతో

అదే విధంగా 2024లో వైసీపీ కఛ్చితంగా అధికారంలోకి రాదు గాక రాదు అని, దాన్ని ఆ నాయకులు, అధికారులు తెలుసుకోవాలి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ముక్కోణపు పరిస్థితిలో పవన్ కళ్యాణ్ మాటలను స్పష్టం అర్ధం చేసుకోవచ్చు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వను అంటే టీడీపీతో పొత్తుకు ఒక సంకేతం. వాళ్ల పల్లకీ మోయడానికి తాను సిద్ధం గా లేను అని చెప్పడం ద్వారా మీతో పొత్తుకు రెడీ కానీ మిమ్మల్ని పల్లకీ ఎక్కించను అని ఇంకో సంకేతం ఇచ్చారు. ఆయన మాటలను బట్టి చూస్తే “పవర్ షేరింగ్” కావాలి అనేది అర్ధం అవుతోంది. ఇది వూహాత్మకంగా టీడీపీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లే కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీని దించడానికి తన వద్ద ప్రణాళికలు ఉన్నాయి అంటూ బీజేపీ కూడా కొన్ని ప్రణాళికలు వేస్తుంది అని చెప్పి బీజేపీని ఒక కన్ఫ్యూజన్ లోకి నెట్టేశారు. ఇదే సందర్భంగా వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడం కోసం రాబోయే ఏడాదిన్నరలో తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్.

author avatar
Srinivas Manem

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !