NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం టాప్ స్టోరీస్ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR : కేసీఆర్‌, జ‌గ‌న్‌… ఈ త‌ప్పును మీరు స‌రిదిద్దాల్సిందే

KCR : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి త‌క్ష‌ణం స్పందించాల్సిన స‌మ‌స్య ఇది. స‌మాజంలో ఓ వైపు ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటే… ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని బ‌తుకుంటే… కొంద‌రు మాత్రం డ‌బ్బు పిచ్చితో త‌ప్పుడు ప‌నులు చేస్తున్నారు. కరోనా వైద్యంలో వాడే రెమిడిసివర్ ఇంజెక్షన్ అడ్డ‌దారిలో కొనుక్కునేలా చేస్తున్నారు. అడ్డ‌గోలుగా డ‌బ్బులు దోచుకుంటున్నారు.

ఏంటి దీని ఉప‌యోగం?

కరోనా చికిత్సకు అత్యంత కీలకమైన రెమిడిసివర్‌ ఇంజెక్షన్లు అవ‌స‌ర‌మైనంత వ‌ర‌కు అందుబాటులోకి రావడం లేదు. రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్ క‌రోనా చికిత్స‌లో భాగంగా ఒక్కో కరోనా రోగికి ఆరు ఇంజెక్షన్లు కోర్సుగా వాడాల్సి ఉంటుంది. దీంతో కరోనా వచ్చిన రోగులు అందరికి ఆసుపత్రిలో చికిత్స కోసం దీన్ని తప్పనిసరిగా వాడుతున్నారు. దీనికి తోడు ఉన్న కాస్తో కూస్తో ఇంజెక్షన్లను బ్లాక్‌ మార్కెట్టుకు తరలిస్తుండడంతో పేద, మధ్య తరగతుల్లో ఎవరైతే కరోనా బారిన పడుతున్నారో.. వారికి సరైన వైద్యం అందడం లేదు. రెమిడిసివర్‌ అందుబాటులో లేకపోవడంతో పాటు.. డిమాండ్‌ కూడా పెరగడంతో.. రోగుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు కార్పోరేట్‌ ఆస్పత్రులు కొన్ని ఫార్మా కంపెనీలు అలాగే డీలర్లు రంగంలోకి దిగుతున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎవరు స్థాయిలో వారు ఈ రెమిడిసివర్‌ ఇంజెక్షన్లను రోగులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంద‌ని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఏపీలో ఏం జ‌రుగుతోంది?

గత రెండు వారాల నుంచి ఏపీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చాలా వేగంగా వైరస్‌ విస్తరిస్తోంది. చికిత్స‌లో కీల‌క‌మైన రెమిడిసివర్‌ను బహిరంగ మార్కెట్ లో విక్రయించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో కరోనా చికిత్సకు అనుమతించిన ఏపీలోని 200కిపైగా ఆసుపత్రుల్లో మాత్రమే ఇది లభిస్తోంది. ఆయా ఆసుపత్రిలో ఉన్న పేషేంట్స్, కేసుల తీవ్రత, ప్రభుత్వ ఆదేశాల బట్టి ఆసుపత్రులకు దీన్ని సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అత్యధికంగా హెటిరో డీలర్ నుంచే మేజర్ షేర్ సరఫరా అవుతోంది. మార్కెట్‌లో ఇంకా మరో 5 కంపెనీల నుంచి ఈ ఇంజెక్షన్ వచ్చినా సరఫరా అనుకున్న మేర అందుబాటులోకి రాలేదు. రోజుకి 50 వేల ఇంజెక్షన్ల డిమాండ్ ఉంటే 5 వేల ఇంజెక్షన్లు మాత్రమే సరఫరా అవుతున్న పరిస్థితి. దీంతో విపరీతంగా కొరత వచ్చేసింది. ఏపీలో రెమిడిసివర్‌ ఉత్పత్తి చేసే కంపెనీ ఒక్కటే ఉంది. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా జరగడం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

హైద‌రాబాద్‌లో కూడా అదే ప‌రిస్థితి….
హైద‌రాబాద్‌లోనూ పెద్ద ఎత్తున క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. కీల‌క‌మైన రెమిడిసివిర్ ల‌భ్యత త‌క్కువ‌గా ఉండ‌టంతో బ్లాక్ మార్కెట్‌ను ప్ర‌జ‌లు ఆశ్ర‌యించాల్సిన ప‌రిస్థితి. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను కొంద‌రు అడ్డ‌గోలుగా దోచుకుంటున్నారు. ప్ర‌జ‌ల దుర‌దృష్టాన్ని క్యాష్ చేసుకుంటున్న వారి భ‌ర‌తం ప‌ట్టేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు రంగంలోకి దిగాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

author avatar
sridhar

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N