NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: పొత్తుల అంశంపై ఒక్క మాటలో తేల్చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్..ఎవరి మైండ్ గేమ్‌లో పడవద్దంటూ నేతలకు కీలక సూచన..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై స్పందించారు. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటనలో జనసేనతో పొత్తుపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసిన కామెంట్స్ పై నిన్నటి వరకూ జనసేన నుండి స్పందన రాలేదు. రాజకీయ వర్గాల్లో మాత్రం జనసేన – టీడీపీ పొత్తుతోనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయని చర్చ జరుగుతోంది. అధికార వైసీపీ మాత్రం మొదటి నుండి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే గాటికి కట్టేసినట్లుగానే విమర్శలు చేస్తోంది. అయితే పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి సారిగా స్పందించారు. పార్టీ కార్యనిర్వహక సభ్యుల టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

Pawan tele conference with party leaders
Pawan tele conference with party leaders

Read More: CM YS Jagan: మధ్యతరగతి వర్గాలకు గుడ్ న్యూస్ ..ఏపిలో మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ ..

Pawan Kalyan: సంస్థాగత నిర్మాణంపై దృష్టి

పలు పార్టీలు మనతో పొత్తులు కోరుకున్నప్పటికీ మనం మాత్రం ముందుగా సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిద్ధామని అన్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నామని పేర్కొన్న పవన్ కళ్యాణ్.. ఈ వ్యవహారంలో అంతా ఒకటే మాట మీద ఉందామన్నారు. ఎవరు ఏమి మాట్లాడినా..మైండ్ గేమ్ లు ఆడినా మనం మాత్రం పావులు కావద్దని నిర్దేశించారు. తన ఒక్కడి నిర్ణయం మీద ముందుకు వెళ్లననీ, పూర్తి ప్రజాస్వామ్య బద్ధంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనే ముందుకు తీసుకువెళ్తానన్నారు. అప్పటి వరకూ ఎవరేం మాట్లాడినా సంయమనంతోనే ఉండాలని పార్టీ నేతలకు సూచించారు పవన్ కళ్యాణ్. క్షేత్ర స్థాయిలో జనసేన పుంజుకుంటోందని అన్నారు.

మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ

రాష్ట్ర వ్యాప్తంగా 676 మండలాలకు గానూ ఇప్పటి వరకూ 403 మండలాల్లో అధ్యక్షులను నియమించుకున్నామని పేర్కొన్న పవన్.. ఈ ఏడాదిలోపే  సంపూర్ణంగా 175 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలను పూర్తి చేసుకుందామని తెలిపారు. గత సంవత్సరం కరోనా కారణంగా పార్టీ ఆవిర్భావ సభ జరుపుకోలేదన, ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. ఇందు కోసం అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కమిటీ దిశా నిర్దేశం మేరకు మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ ఉంటుందని ఆ సభలో 2024 ఎన్నికలకు కావాల్సిన ఆలోచనలు చేయనున్నట్లు పవన్ చెప్పారు. సంక్రాంతి తరువాత మరో సారి పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు పవన్ తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?