నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సరైన పాయింట్ లేవనెత్తిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Share

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశానికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సరైన పాయింట్ లేవనెత్తారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పట్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2026 లో జన గణన అదారంగా అసెంబ్లీ స్థానాల పునర్విభజన ఉంటుందని తెలిపారు.  2026లో జనాభా లెక్కలు వచ్చి, రాజ్యాంగ సవరణ చేసి, పునర్విభజన ప్రక్రియను ప్రారంభించి దాన్ని పూర్తి చేయాలంటే 2031 వరకు ఆగాల్సిందే.

 

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2031 వరకు సాధ్యం కాదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు సోమిరెడ్డి. విభజన చట్టం హామీల్లో పునర్విభజన ఉందనే విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తుంచుకోవాలన్నారు. కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనకు అవసరం లేని చట్ట సవరణ తెలుగు రాష్ట్రాలకే అవసరం అయ్యిందా అని ప్రశ్నించారు సోమిరెడ్డి. ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన హామని వెంటనే నెరవేర్చాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

 

ఏపి, తెలంగాణకు చెందిన ఎంపిలు సభ్యులు పార్లమెంట్ లో సోమిరెడ్డి లేవనెత్తిన సందేహాన్ని ప్రశ్నించకపోవడం గమనార్హం. విభజన చట్టంలో ఉన్న అనేక హామీలను కేంద్రం బుట్టదాఖలు చేసింది. అందులో ప్రధానంగా ఏపికి ప్రత్యేక హోదా ఉంది. పోలవరం ప్రాజెక్టు ఉంది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు. అదే విధంగా విభజన చట్టంలో ఉన్న నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రం పక్కన పెట్టేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కేంద్రంపై ఏ విధంగా వత్తిడి తీసుకువస్తారో వేచి చూద్దాం.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

15 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

23 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago