‘అధీర్’ వ్యాఖ్యలపై ఉభయ సభల్లో దుమారం.. మరో ముగ్గురు రాజ్యసభ ఎంపీలపై వేటు

Share

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలపై ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించినందుకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మహిళా ఎంపీలు పాల్గొన్నారు. దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి గిరిజనురాలైన ద్రౌపది ముర్మును మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని ఆరోపించారు బీజేపీ ఎంపీలు.  గురువారం లోకే సభ ప్రారంభం అయిన వెంటనే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తక్షణమే అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు.

 

అయితే ఇప్పటికీ అధీర్ క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలిపారు. ఉభయ సభలు అధికార విపక్ష పోటీ పోటీ నినాదాలు హోరెత్తాయి. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలనీ బీజేపీ, పెరిగిన ధరలు, నిత్యావసరాలపై జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై చర్చకు విపక్షాలు నినాదాలు చేస్తూ గందరోగళం సృష్టించడంతో లోక్ సభ ను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ, తర్వాత మధ్యాహ్నం 2 గంటలు వరకూ స్పీకర్ ఓంబిర్లా వాయిదా వేశారు. రాజ్యసభను సాయంత్రం నాలుగు గంటల వరకూ చైర్మన్ వెంకయ్యనాయుడు వాయిదా వేసినట్లు ప్రకటించారు. అంతకు ముందు రాజ్యసభ నుండి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. అమ్ అద్మీ పార్టీ ఎంపీలు సుశీల్ కుమార్ గుప్తాతో పాటు మరో ఇద్దరు ఎంపీలను పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకూ సస్పెన్షన్ కు గురయ్యారు.  దీంతో పార్లమెంట్ నుండి సస్పెండ్ అయిన వారి సంఖ్య 27కు చేరింది.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

40 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

49 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago