NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ యూట‌ర్న్‌.. బండారు శ్రావ‌ణి టికెట్ మారిపోతోందా..?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన టికెట్‌ను కూడా మారుస్తున్నార‌ని తెలుస్తోంది. రాత్రికి రాత్రి ఏం జ‌రిగినా ఆశ్చ ర్యం లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అదేంటి ఉన్న‌ట్టుండి.. అనుకుంటున్నారా? ఇక్క‌డే కీల‌క విష‌యం ఉంది. ఇటీవ‌ల చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌తో శింగ‌న‌మ‌ల రాజ‌కీయాలు యూట‌ర్న్ తీసుకు న్నాయి. వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ పోటీ చేస్తున్న రామాంజ‌నేయులుపై బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ట్ర‌క్కు డ్రైవ‌ర్‌కు టికెట్ ఇచ్చార‌ని.. వేలిముద్ర‌గాడ‌ని.. చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఆయ‌న ఏ ఉద్దేశం లో అన్నారో తెలియ‌దు కానీ.. ఇవి టీడీపీకి సెగ పెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రామాంజ‌నేయులు ఎవ‌రు? అంటే.. చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ల కంటే కూడా ఫేమ‌స్ అయిపోయాడు. ఆయ‌న ఫొటో తెలియ‌క పోవ చ్చు. కానీ, చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల త‌ర్వాత రామాంజ‌నేయులు పేరు మాత్రం అంద‌రికీ తెలిసింది. ఇక‌, శింగ‌న‌మ‌ల రాజ‌కీయం కూడా యూట‌ర్న్ తీసుకుంది.

అస‌లే సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న‌ప్ప‌టికీ.. గ‌త ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయిన బండారు శ్రావ‌ణి శ్రీకే చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. ఈ కేటాయింపుపై త‌మ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నా రు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు మొండిగానే ముందుకు సాగుతున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఎం.ఎస్ రాజు వ‌ర్గం శ్రావ‌ణికి ఏమాత్రం స‌హ‌క‌రించ‌డం లేదు. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లునియోజ‌క‌వ‌ర్గంలోటీడీపీ గ్రాఫ్‌ను త‌గ్గించాయి. ఇక‌, కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌ల‌మైన నాయ‌కుడి గా సాకే శైల‌జానాథ్ పోటీకి దిగుతున్నారు.

దీంతో టీడీపీ ముప్పేట చిక్కులు ఎదుర్కొనే ప‌రిస్థితికి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌దీశారు. అయితే..అంద‌రినీ కాదు.. గ‌తంలో పార్టీ త‌ర‌ఫున గెలిచి.. త‌ర్వాత వైసీపీలోకి వెళ్లిన యామినీ బాల‌ను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆమెను పార్టీలోకి తీసుకోవ‌డం తోపాటు.. శింగ‌న‌మ‌ల టికెట్‌ను కూడా ఆమెకు ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

త‌ద్వారా.. స్థానికంగా ప‌ట్టుకున్న శ‌మంత‌క‌మ‌ణి వర్గం.. టీడీపీకిఅనుకూలంగా మార‌డంతోపాటు.. ఎం.ఎస్‌. రాజు వ‌ర్గంకూడా సానుకూలంగా మారుతుంద‌నే లెక్క‌లు వేస్తున్నారు. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన బాల‌.. ఈ రోజో రేపో.. టీడీపీలోకి రానున్నారు త‌ర్వాత‌.. నాలుగు రోజుల్లోనే టికెట్ మార్పుపై చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు తెలిసింది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju