NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

KCR: క‌రోనా విష‌యంలో కేసీఆర్ క‌న్నెర్ర చేస్తే…ఇలా ఉంటుంది

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫైర్ అవుతే చ‌ర్యలు ఎలా ఉంటాయి? ఆయ‌న దూకుడుగా స్పందిస్తే వేగంగా ప‌రిస్థితులు ఎలా మారిపోతాయి? అనేందుకు తాజా ప‌రిణామం ఉదాహ‌ర‌ణ. కొవిడ్‌ చికిత్సలో భాగంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ దవాఖానలపై తెలంగాణ‌ ప్రభుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం, ఏకంగా హైకోర్టు వ‌ర‌కు పిటిష‌న్లు దాఖ‌లైన త‌రుణంలో కేసీఆర్ స‌ర్కారు సీరియ‌స్‌గా స్పందిస్తోంది. ప్ర‌భుత్వ‌ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కొరడా ఝుళిపిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Read More: Corona: క‌రోనాతో కాదు ఎలుక‌ల‌తో చ‌స్తున్నాం… భార‌త్ ను స‌హాయం కోరిన ఆ దేశం
క‌రోనా చికిత్స‌పై హాట్ హాట్ చ‌ర్చ‌

క‌రోనా చికిత్స పేరుతో ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడిపై మ‌రోమారు హైకోర్టు వేదిక‌గా హాట్ హాట్ వాద‌న‌లు సాగాయి. ప్రైవేటు ఆస్ప‌త్రుల‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసాం అని టీఎస్ హైకోర్టుకు డైరెక్ట‌రేట్ ఆఫ్ హెల్త్ శ్రీ‌నివాస‌రావు తెలిపారు. మొదటి దశ కరోనా సమయంలో ప్రైవేటు హాస్పిటల్స్ నుండి పేషేంట్స్ కు 3 కోట్లు రీ ఫండ్ ఇప్పించాముని, ఈ సారి కూడా ప్రయివేటు హాస్పిటల్ లో వసూలు చేసిన వారికి రీ ఫండ్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. మ‌రోవైపు ఆయా ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

 

Read More: KCR: ఈట‌లకు త‌న‌ రాజ‌కీయం రుచి చూపిస్తున్న కేసీఆర్‌

ఆస్ప‌త్రుల‌పై చ‌ర్య‌లే చ‌ర్య‌లు….

తెలంగాణ రాష్ట్రంలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ వైద్యశాలల లైసెన్స్‌లను రద్దు చేయడంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 113 దవాఖానలకు వైద్య ఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తాజాగా కొత్తగా 8 ప్రైవేట్ దవాఖానలకు నోటీసులు జారీ చేసింది. ఇదిలాఉండ‌గా ,రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 22 కొవిడ్‌ దవాఖానల లైనెన్స్‌లు రద్దయ్యాయి. మ‌రోవైపు కొవిడ్‌ లైసెన్స్‌ రద్దు చేయడంతో డీహెచ్‌ శ్రీనివాస్‌రావుతో ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు స‌మావేశం అవుతున్నాయి. తమ ఆస్పత్రులకు కొవిడ్ లైసెన్స్‌ రద్దు చేయడంపై ఆరా తీస్తున్నారు. ఈ అనుమ‌తుల ర‌ద్దు ప‌ర్వంతో తమ ఆస్పత్రులను రెప్యుటేషన్ దెబ్బ తీసుకుంటుంద‌ని, ఈ విష‌యంలో నిర్ణ‌యాలు ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరుతున్నారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju