YSRCP: సినీ పెద్దల సెన్షేషనల్ నిర్ణయం..! పెద్ద డిమాండ్ తో నేడు భేటీ..?

Share

YSRCP: ఏపిలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నిర్ధేశించిన ధరలకే టికెట్లు విక్రయించాలనీ, బెన్ ఫిట్ లు నిర్వహించడానికి వీలులేదనీ, నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ నిబంధనలు కశ్చితంగా అమలు చేస్తే సినిమా ధియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందనీ, భారీ బడ్జెట్ సినిమాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందనీ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సినీ వర్గాలు భావించినట్లుగానే తాజాగా విడుదల అయిన భారీ బడ్జెట్ సినిమా అఖండ మువీ కలెక్షన్లపై ఆ ప్రభావం కొంత పడింది. అఖండ సినిమా రెండు రోజుల కలెక్షన్ రూ. 21 కోట్ల 62 లక్షలు వచ్చినట్లు సమాచారం. కానీ ఏపిలో ఇన్ని ఆంక్షలు లేకపోతే దాదాపు 30 కోట్లు నెట్ కలెక్షన్ వచ్చేది. 38 కోట్లు గ్రాస్ వచ్చేది. త్వరలో భారీ బడ్జెట్ మువీ రిలీజ్ లు ఉన్నాయి. ఏపిలో ఆన్ లైన్ టికెటింగ్ విధానం తదితర నిబంధనలు కఠిన తరం చేసిన తరువాత విడుదలైన తొలి భారీ బడ్జెట్ మువీ అఖండ మువీ కావడంతో సినీ పరిశ్రమకు ఇది ఒక ట్రైలర్ గా చూస్తున్నారు. దీనిపై పడిన ప్రభావం ఆ తరువాత వరుసగా వచ్చే పుష్ప, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, సర్కార్ వారి పాట లాంటి భారీ బడ్జెట్ సినిమాలపై కూడా పడుతుందని భావిస్తున్నారు.

YSRCP: అఖండ కలెక్షన్ లతో అప్రమత్తమైన సినీ పెద్దలు

దీంతో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు అప్రమత్తం అయ్యారు. ఈ పరిణామాలపై చర్చించేందుకు సినీ నిర్మాతలు కొందరు ఈ రోజు సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అఖండ సినిమా హిట్ అయినప్పటికీ రావాల్సిన కలెక్షన్ కంటే తక్కువ వచ్చిందని వాళ్లు భావిస్తున్నారు. వాస్తవానికి అఖండ బడ్జెట్ రూ.52 కోట్లు మాత్రమే. ఇన్ని నిబంధనలు పెట్టినా అఖండ కు రూ. 75 కోట్లు కలెక్షన్ లు వస్తే లాభాల్లో ఉన్నట్లే. కానీ ఇక రాబోయే మువీల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ రూ.350 కోట్లు పెట్టారు. రాధేశ్యామ్ కు సుమారు అంతే ఖర్చు పెట్టారు. భీమ్లానాయక్ కు రూ.140కోట్లు, సర్కార్ వారి పాటకు రూ.130 కోట్లు, పుష్పకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు. ఏపిలో ప్రభుత్వ నిబంధనలు ఇదే విధంగా కొనసాగితే ఈ భారీ బడ్జెట్ సినిమాలకు భారీగానే వసూళ్లు తగ్గే అవకాశం ఉంటుంది, తద్వారా తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అందుకే సినీ పరిశ్రమ వర్గాలు.. ఏపి ప్రభుత్వానికి ఒకే ఒక్క విన్నపం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆంక్షలన్నీ ఒక్క ఆరు నెలల పాటు వాయిదా వేయాలని కోరడానికి సన్నద్దం అవుతున్నట్లు సమాచారం. మే నెల వరకూ పూర్తి తమను వదిలివేసి, ఆ తరువాత సినీ పరిశ్రమను పూర్తిగా ప్రభుత్వ కంట్రోల్ లోకి తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే రాబోయే సినిమాలు అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు, వీటి ద్వారా దాదాపు రూ. 1800 కోట్ల వ్యాపారం ఆరు నెలల్లో జరగనుంది. వీటి వరకూ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతే ఇకపై తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీయాలన్న ఆలోచనలో సినీ పెద్దలు ఉన్నారు.

YSRCP: ఆంక్షలు ఆరు నెలల వాయిదాకు తీర్మానం..?

అందుకే ఈ భారీ బడ్జెట్ సినిమాలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వానికి ఆరు నెలల వాయిదా ప్రతిపాదన చేయాలని భావిస్తున్నారుట. అయితే ఈ అంశాన్ని ఏపి ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి ఒప్పించడం ఎలా అనే దానిపైనే తర్జన భర్జన జరుగుతోందట. సినీ పెద్దలకు సీఎం జగన్మోహనరెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఆయనకు సన్నిహితులైన నాగార్జున లాంటి వారు వ్యక్తిగతంగా కలిసేందుకు జగన్ అవకాశం ఇస్తున్నారు కానీ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజ్ తదితర సినీ పెద్దలు కలిసేందుకు అపాయింట్మెంట్ కోరితే సంబందిత మంత్రి పేర్ని నానితో కలవాలని సూచిస్తున్నారు కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఒక వేళ మంత్రి పేర్ని నానిని కలిసినా ఆయన వెంటనే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేదు. ముఖ్యమంత్రితో చర్చించి వెల్లడిస్తామని చెబుతారు. దీంతో కాలయాపన జరిగే అవకాశం ఉంది. కావున నేటి సమావేశంలో మూకుమ్మడిగా ఒక నిర్ణయానికి రావాలనీ, ఆ తరువాత నేరుగా ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి తమ సాధక బాధలు వ్యక్తం చేసి ఈ ఒక్క నిర్ణయానికి (ఒక్క ఆరు నెలలు సడలింపు) సమ్మతించాలని కోరేందుకు సన్నద్దం అవ్వనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

27 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

30 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago