AP Fiber Grid; జగన్ రెండు పరీక్షలు.. ఇన్ సైడర్ లో ఫెయిల్..! మరి ఫైబర్ గ్రిడ్ లో..!?

AP Political Survey: 4 Months - 4 Surveys Against YSRCP
Share

AP Fiber Grid;  అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో టీడీపీని ఎలాగైనా ఇరికించాలి..ఎలాగైనా సరే మాజీ మంత్రులను కొందరిని అరెస్టు చేయాలి..చంద్రబాబు మీద, నారా లోకేష్ మీద అవినీతిపరులు అనే ముద్ర వేయాలని వైసీపీ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. అవినీతిపరులు అని ముద్ర వేయడం వేరు, చట్టపరంగా నిరూపించడం వేరు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, జగన్మోహనరెడ్డి, విజయసాయిరెడ్డిల విషయంలో తేడా ఏమిటంటే జగన్మోహనరెడ్డి, విజయసాయిరెడ్డిలు అవినీతి పాల్పడ్డారని సీబీఐ ప్రాధమిక నిర్ధారణకు వచ్చి అరెస్టు చేసింది, కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇప్పటికే కేసుల్లో ఏ 1, ఏ 2 గా ఉన్నారు. కానీ ఇప్పటి వరకూ టీడీపీ నేతలపై ఆరోపణలే తప్ప ఆధారాలు చూపలేదు. అందుకే గడచిన రెండు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చట్టపరంగా టీడీపీ అవినీతి పార్టీ, చంద్రబాబు గానీ నారా లోకేష్ గానీ అవినీతిపరులు అని నిరూపించాలని చాలా తపన పడుతోంది. తాపత్రయపడుతోంది.

AP Fiber Grid; YS Jagan Exams about TDP Corruption
AP Fiber Grid; YS Jagan Exams about TDP Corruption

AP Fiber Grid;  అమరావతి ఇన్ సైడర్ చట్టబద్ధత లేదు..!!

అందుకే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది జరిగింది అంటూ ఆరోపణలు చేసింది. అయితే అది చట్టబద్ధంగా అట్టర్ ప్లాప్ అయిపోయింది. కోర్టులు నమ్మలేదు, జనం కూడా పెద్దగా నమ్మలేదు. ఇదేమి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు ఏదో ట్రేడింగ్ లో ఉన్న పదాన్ని తీసుకువచ్చి కుంభకోణం అన్నారు, లక్ష కోట్లు అన్నారు ఏమి లేదని అది తేలిపోయింది. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లో టీడీపీ దోషి కాదని తేలిపోయింది. నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు మరొకటి తెరిపైకి తీసుకువచ్చారు. అదే ఫైబర్ గ్రిడ్, ఏపి ఫైబర్ గ్రిడ్ టెండర్లలోనే 321 కోట్లకు పైగా భారీ కుంభకోణం జరిగింది అని తెరమీదకు తీసుకువచ్చి ఏపి సీఐడీ విచారణ చేస్తోంది. వాస్తవానికి ఈ కేసు కూడా ఏడాదిన్నర నుండి నడుస్తున్నదే. గత ఏడాది పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే దీనిపై సీబీఐ విచారణ జరగాలి అని, నారా లోకేష్ ను అరెస్టు చేయాలని, నారా లోకేష్ అవినీతిపరుడు అంటూ పార్లమెంట్ లోనే దర్నాకు దిగారు. కానీ ప్రభుత్వం ఏమి నిరూపించలేదు. దీంతో సీబీఐ దీన్ని టేకప్ చేయలేదు.

AP Fiber Grid; YS Jagan Exams about TDP Corruption
AP Fiber Grid; YS Jagan Exams about TDP Corruption

ఫైబర్ గ్రిడ్ తో కాస్త దొరికినట్టే..!?

అయితే ఎప్పుడైతే అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు ను కోర్టు కొట్టేసిందో అప్పుడు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసును తెరమీదకు తెచ్చి ఏపి సీఐడీ విచారణ చేస్తోంది. దీనిలో భాగంగా నిన్న ఒకరిని అరెస్టు చేశారు. సాంబశివరావు అని తెరాసాఫ్ట్ కు చెందిన అధికారి. ఆయన నారావారిపల్లెకు చెందిన వ్యక్తి. చంద్రబాబుకు సన్నిహితుడు. ఇప్పుడు ఈ టెండర్ల బాగోతంలో నారా లోకేష్ పాత్ర ఉంది అని ఇరికించాలనేది వైసీపీ ప్లానింగ్. అందుకే నారా లోకేష్ తో పాటు ఫైబర్ గ్రిడ్ కి సంబంధించి ఐటీ శాఖలో పని చేసిన వారిని, హరిప్రసాద్, అప్పుడు పని చేసిన ఐఏఎస్ లు, ఇంకొంత మంది టీడీపీ నేతలు, కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్లు అందరినీ ఇరికించాలి అనేది ఒక ప్లానింగ్. దీనికి సంబంధించి నిన్న ఒకరిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే అప్రూవర్ గా మారి ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తే మిగిలింది అంతా లాగుతారు. నారా లోకేష్ ను అరెస్టు చేస్తారు. ఏలాగైనా నారా లోకేష్ ను అరెస్టు చేయాలి, దీనిలో ముద్దాయిగా చూపాలి అనేది వైసీపీ ప్లాన్. ఇదంతా కూడా టీడీపీకి తెలుసు. దీనిపై టీడీపీ లీగల్ టీమ్ కూడా కసరత్తు చేసింది. అసలు ఈ కేసులో నారా లోకేష్ కు సంబంధం లేదు, అసలు దీనిలో అవినీతే జరగలేదు అని లీగల్ గా ప్రూ చేయడానికి రెడీ అవుతోంది. అవసరమైతే ముందస్తుగా కోర్టులో పిటిషన్ వేసి నారా లోకేష్ వరకూ ఈ కేసు వెల్లకుండా చూసే ప్రయత్నంలో టీడీపీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే కోర్టుల నుండి చాలా మొట్టికాయలు ఎదుర్కొన్న ప్రభుత్వం మరి ఈ కేసులో అయినా అనుకున్నది సాధిస్తుందా లేదా అనేది చూడాలి మరి.


Share

Related posts

ఏపీలో క‌రోనా కొత్త ట్విస్ట్‌… చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

sridhar

జగన్ కి గిఫ్ట్ ఇస్తాం… టీడీపీ ఎమ్మెల్యే..!!

Special Bureau

ఓ రెడ్డి, ఇంకో చౌద‌రి…ఆమెపై 139 మంది అత్యాచారం?

sridhar