అదే జరిగితే చంద్రబాబు పరువు అంతా గోవిందా…! తిరుపతిలో తలెత్తుకోలేరేమో…?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగియగానే అందరి చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఉప ఎన్నికలపై పడుతుంది. అయితే చంద్రబాబునాయుడు ఎంతో ముందుగా తాను ఎన్నికలకు రెడీ అయినట్లు పార్టీ అభ్యర్థి పేరును కూడా ప్రకటించేసి సవాల్ విసిరారు. ఇప్పుడు అదే అత్యుత్సకత అతని కొంప ముంచుతోందా…?

 

ఎన్నో అనుమానాలు…

విషయం ఏమిటంటే…. హైదరాబాద్ లో సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పనబాక దంపతులను కలిశారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఆయన వారితో చర్చించేందుకు అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే దంపతులిద్దరూ తాము తర్వాత చంద్రబాబునాయుడును కలిసి మాట్లాడుతామని… తమ కూతురు వివాహ కార్యక్రమంలో ప్రస్తుతం బిజీగా ఉన్నామని చెప్పారు. అయితే ఇప్పుడు టిడిపి పార్టీ వారు ఎందుకో ఒక్కసారిగా కీడును శంకిస్తున్నారు. తమ అధినేత ఊరికి ముందు అభ్యర్థి పేరు ప్రకటించగానే హర్షం వ్యక్తం చేసిన వారు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సన్నాహాలు మొదలు పెట్టారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా కథ అడ్డం తిరిగే అవకాశం ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి.

స్పందనే లేదే….?

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణం వల్ల ఖాళీ అయిన తిరుపతి పార్లమెంటు సీటు లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే వీటిని మార్చిలోగా నిర్వహించాల్సి ఉంటుంది. అక్కడ పోటీ చేయడానికి పనబాక లక్ష్మి ని ఎంపిక చేసినట్లు బాబు ప్రకటించేశారు. అయితే చంద్రబాబు ప్రకటించిన తర్వాత దీనిపై స్పందించకపోవడం విశేషం. తాను పోటీ చేస్తున్నానని లేదా అలాంటి ఉద్దేశాలు లేవని పనబాక ఎక్కడా చెప్పలేదు. అంతెందుకు తనను అభ్యర్థిగా ప్రకటించేందుకు చంద్రబాబుకు కనీసం కృతజ్ఞతలు లేదా ధన్యవాదాలు కూడా చెప్పలేదు. దీంతో అందరికి ఒక్కసారిగా కొత్త అనుమానాలు వచ్చేసాయి. తమతో మాట మాత్రం కూడా చర్చించకుండా ఆమె పేరును అభ్యర్థిగా ప్రకటించిన హైకమాండ్ పై ఒక మాజీ ఎంపీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం పెరిగింది.

అదే జరిగితే ఇక అంతే…

ఇక ఇటువంటి వార్తలకు అడ్డుకట్ట వేసే లాగానే చంద్రబాబు సోమిరెడ్డిని లక్ష్మి ని హడావిడిగా కలిసేందుకు పంపించారు అని అంటున్నారు. అయితే చంద్రమోహన్రెడ్డి ఆమెతో ఎంతసేపు మాట్లాడినప్పటికీ ఆమె అందుకు సానుకూలంగా స్పందించలేదని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో అయ్యే ఖర్చు విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించినట్లు తెలిసింది. అసలు పనబాక లక్ష్మి టిడిపిలో ఉండాలనుకుంటున్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కొన్ని వార్తలు అయితే ఆమె బిజెపిలో చేరి అక్కడి నుండి ప్రచారం పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని వచ్చేసాయి.

వాటిలోని ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలియదు ప్రస్తుతానికైతే ఆమె తమ కూతురు వివాహం లో బిజీగా ఉంది. ఇక ఈ విషయమై మళ్ళీ మాట్లాడుకుందాం అని సోమిరెడ్డి వేసినట్లు చెబుతున్నారు. ఆమె పార్టీ మారినా లేక వేరే పార్టీ నుండి పోటీ చేస్తానని చెప్పినా చంద్రబాబు పరువు గంగలో కలినట్లే…