TDP Chandrababu: ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడం, క్షేత్రస్థాయిలో క్యాడర్ యాక్టివ్ గా ఉండటం, అలానే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే దాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం చాలా కీలకం. రాబోయే రెండున్నర సంవత్సరాలు కూడా టీడీపీ ఇటువంటి టాస్క్ లు చేస్తూనే ఉండాలి. ఎక్కడ చేజారినా పార్టీ మొత్తం బాబు నుండి చేజారడం ఖాయమే.. మరో వైపు చంద్రబాబు, లోకేష్ లు పాదయాత్రలో, బస్సు యాత్రలో, రథయాత్రలో చేసి నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి నాయకుల ద్వారా గ్రౌండ్ వర్క్ చేయాల్సిన గడ్డు స్థితి ఏర్పడింది.. ఆరు నెలల క్రితం పరిస్థితికి పోలిస్తే ప్రస్తుతం టీడీపీ కాస్త పర్వాలేదు. కొద్దొగొప్పో తెగిస్తున్నారు. కేసులకు అంతగా భయపడటం లేదు. వైసీపీకి వ్యతిరేకంగా పోరాడటానికి రెడీ అవుతున్నారు. కానీ..!
TDP Chandrababu: కొత్త చేరికలపై చాలా ఆశలు..!?
అయితే ఈ సమయంలో టీడీపీలో చేరికలు ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇస్తాయి. కొత్తగా చేరే వారు ఏ పార్టీకి ఏందో కొంత జోష్ వస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆయా జిల్లాల్లో పట్టు ఉన్న ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట. విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీపై ఆసక్తిగా ఉన్నట్టు జరుగుతుంది. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. నిజానికి ఆయన బీజేపీకి కంకణబద్దుడే. కానీ ఆయన మొదటి నుండి జగన్‌కు వ్యతిరేకి. బీజేపీలో ఉంటూ మొదటి నుండి వైసీపీని విమర్శిస్తున్నది విష్ణుకుమార్ రాజే. మొదటి నుండి వైసీపీని ఘాటుగా విమర్శిస్తూ వస్తున్నారు. ఆయనకు వైసీపీ పరిపాలన నచ్చడం లేదు.

* విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు మళ్లీ పోటీ చేస్తారా..? లేదా అనేది అనుమానమే. పార్టీలో ఉంటారా..? లేదా అనేది కూడా ఒక డౌటే. ఒకవేళ గంటా టీడీపీలోనే ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గం నుండే మళ్లీ పోటీ చేస్తారా, లేదా అనేది కూడా అనుమానమే. .!ఎందుకంటే గంటా ఒక నియోజకవర్గాన్ని, ఒక పార్టీని అంటిపెట్టుకుని ఉండరు. ఈ నియోజకవర్గానికి విష్ణుకుమార్ రాజు అయితే సరైన అభ్యర్ధి అని టీడీపీ భావిస్తోంది. ఆయనను టీడీపీలో చేర్చుకునేందుకు పార్టీ సుముఖంగా ఉండటంతో పాటు ఆయన కూడా టీడీపీలో చేరడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారట. ఆయన పోటీ చేస్తారా..? లేక ఆయన కుమార్తె పోటీ చేస్తారా..? అనేది ఇంకా డిసైడ్ కాలేదు కానీ టీడీపీలో చేరిక మాత్రం దాదాపు ఖాయమేనని వార్తలు వినబడుతున్నాయి.

మాజీ మంత్రి.. వెంకయ్య శిష్యుడు..!
ఆయనతో పాటు కైకలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు కూడా టీడీపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారట.ఈయన బీజేపీలో ఉన్నప్పటికీ.., మనసు మొత్తం టీడీపీలోనే ఉంటుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ప్రీతిపాత్రమైన శిష్యుడు. ఈయన నేరుగా టీడీపీలో చేరడానికి ఇంట్రెస్ట్ ఉన్నారనేది సమాచారం. ఆయన గతంలో టీడీపీ, బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు 2014 నుండి 2018 వరకూ చంద్రబాబు మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. వివాదరహితుడుగా పేరుంది. ఆయన మొదటి నుండి బీజేపీకి కంకణబద్దుడు అయినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి లేదు. ఆయన వారసుడి రాజకీయ టీడీపీలో చేరనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రసుతం కైకలూరులో టీడీపీకి సరైన అభ్యర్ధి కూడా లేరు. గతంలో టీడీపీ తరపున గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన జయమంగళ వెంకట రమణ ప్రస్తుతం అంత యాక్టివ్ గా లేరు. దానికి తోడు ఆయన ఆర్ధికంగా కూడా వీక్ అయ్యారు. అందుకే కామినేని కుటుంబం నుండి టీడీపీ తరుపున టికెట్ కేటాయిస్తే బాగుంటుంది ఆ పార్టీ ఆలోచనగా ఉందట. వీరు ఇద్దరు బీజేపీ నుండి టీడీపీలో చేరడం ఖాయమనే వార్తలు వినబడుతున్నా వారు ఇంకా అధికారికంగా దృవీకరించలేదు. త్వరలో వీరి చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..!