NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అక్కడి హీరోలు… ఇక్కడ జీరోలు కావాల్సిందేనా…?

సినిమాలు, రాజకీయాలను భారత దేశ ప్రజలు అభిమానించినట్లు ఇలా ఒకే స్థాయిలో దేశంలోనూ ప్రాధాన్యతను ఇవ్వరేమో. ఇక ఈ రెండింటిని లింక్ చేస్తూ చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. గతంలో సినిమా స్టార్లు రాజకీయ రంగప్రవేశం చేశారంటే ఓట్లు వారికి టికెట్లు తెగినంత సులువుగా రాలేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి…!

 

ట్రెండ్ మారిందండోయ్…!

రజనీకాంత్..! ఈ పేరు చెబితే ఇప్పటికీ సౌత్ ఇండియా ఇండస్ట్రీకే షేక్ అయిపోతుంది. తమిళనాడులో అతనికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఒక్క మాట చెబితే ఎందుకు..? ఏమిటి..? అని ఆలోచించకుండా గుడ్డిగా అభిమానించి ఫాలో అయిపోయే అభిమానులు ఎంతో మంది. పవన్ తో పోలిస్తే రజనీ స్టార్ డమ్ ఎక్కువ. మరి రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఇన్ని సంవత్సరాల గడువు ఎందుకు తీసుకుంటున్నట్లు? పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తన రాజకీయ పార్టీ పై దృష్టి ఎందుకు సారించడంలేదు? పవన్ ఇంటినుండే అతనికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి ఎందుకు ఎవరూ పెద్దగా మొగ్గు చూపటం లేదు. అది పర్సనల్ విషయాలు అయినా ఇక్కడ కాలంతో మారుతున్న ట్రెండ్ ను మనం గమనించాల్సిందే…!

అది వేరు…. ఇది వేరు?

గతంలో ఎంతోమంది సౌత్ ఇండియా సూపర్ స్టార్లు రాజకీయాల్లో చక్రం తిప్పిన వారే. రామారావుతో మొదలుకొని జయలలిత, కరుణానిధి వరకు అందరూ ఆరంగ్రేటం నుండి ఎదురులేకుండా రాజకీయాల్లో నిలిచారు. గెలుపోటముల విషయం పక్కన పెడితే వారిని ప్రజలు ఆరాధ్యదైవంగా భావిస్తారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. చిరంజీవి పార్టీ పెట్టాడు ప్రజలు బాగానే ఆదరించారు…. కానీ నిలదొక్కుకునేందుకు మాత్రం అతనికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. ఒకరకంగా చూస్తే సినిమాలు వేరు రాజకీయాలు వేరు. సినిమా రంగుల ప్రపంచం. రాజకీయాలలో అసలు రంగు బయటపడుతుంది. సినిమాల్లో హీరో ఎలాంటి వేషాలు వేసినా జనాలు చప్పట్లు కొడతారు కానీ రాజకీయాల్లో జనాలు ముందు వారు చప్పట్లు కొట్టే వేషాలు మాత్రమే వేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.

అసహనం…. అనాసక్తి

తాజాగా రజిని తన రాజకీయ పార్టీ విషయంపై స్పష్టత ఇస్తాడు అనుకుంటే మళ్ళీ అభిమానులను నిరాశపరిచాడు. తనకు కొద్దిగా సమయం కావాలని కోరాడు. ఇక వారందరూ కూడా దాదాపు అనాసక్తిగా ఉన్నారన్నది తమిళ మీడియా వర్గాల సమాచారం. అదీ కాకుండా చివరికి అతను బిజెపికి సపోర్ట్ ఇస్తానంటే మాత్రం పెద్ద ఎత్తున అసహనం పెరిగిపోతోంది. ఒకప్పటిలా జనాలు తమ ఫేవరేట్ హీరోని స్క్రీన్ పైన చూసేందుకు గంటల గంటల క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక గుడ్డిగా అభిమానించే వారికి కళ్ళు తెరిపించే సోషల్ మీడియా కొన్ని నమ్మలేని నిజాలను ఎప్పటికప్పుడు బయటపడుతూనే వచ్చింది. వారు కూడా సామాన్యులే…. ఇది వారి వృత్తి అన్నట్లు జనాల్లో నిదానంగా ఒక నమ్మకం మొదలైపోయింది.

అంతెందుకు ఈరోజు ఉన్న ప్రభుత్వం రేపు ఉండట్లేదు…. మొన్నటిదాకా టాప్ హీరో అవుతారు అనుకున్నవాళ్ళు ఇప్పుడు ఖాళీ కాల్ షీట్లు పట్టుకుని ఉన్నారు. ఇలాంటి ఎన్నో కారణాల మధ్య సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వస్తే అసలుకే మోసం వస్తుందని ఎంతోమంది వెనుకాడుతున్నారు. మరి కమల్ హాసన్ కూడా పార్టీని ప్రకటించాడు కానీ క్రియాశీలక రాజకీయాల్లోకి పూర్తిగా అడుగు పెట్టినట్లయితే కనిపించడం లేదు. అంతటి పెద్ద పెద్ద స్టార్ లే వెనకడుగు వేస్తుంటే కొత్త వాళ్ళకి ఏం భరోసా ఉంటుంది? మొత్తానికి రాజకీయాల్లోకి సినిమా వారి రంగప్రవేశం రంగప్రవేశం మరికొద్ది సంవత్సరాల్లో చరిత్ర కానుందా…?

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!