NewsOrbit
Featured బిగ్ స్టోరీ

నిజమైన ‘హీరోయిజం’ చూపించే ‘దమ్ము’ లేని తెలుగు హీరోలు…

ముందు నుండి అనుకుంటున్నదేకరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తర్వాత మన హీరోలు మాత్రం ఇండస్ట్రీకి తోడ్పడతారు అన్న ప్రశ్న ఎప్పటి నుండో ఉంది. లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికుల సహాయార్థం కొంత మొత్తాన్ని విరాళంగా పలువురు హీరోలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మన హీరోలు ఇచ్చిన డబ్బు వారికి వారం రోజులు కడుపు నిండుతుంది లేదా నెల రోజులు పూట గడిచేలా చేస్తుంది. మరి తర్వాత..? వారికి ఉపాధి కల్పించేది ఎవరు? ప్రతి ఒక్క టెక్నీషియన్ కి ఒక భరోసా ఇచ్చేది ఎవరు? నిర్మాతలే కదామరి అలాంటి నిర్మాతలను ఆదుకునేది ఎవరు.

List of Tollywood Heroes' Rankings

నిర్మాతలకు డబ్బులకి కొదవా“.. అంటారా?

ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా వారికీ ఆర్థిక పరంగా కొన్ని పరిమితులు ఉంటాయి. మూడు నెలల నుండి సినిమా షూటింగ్ లు ఆగిపోతే వారికి వచ్చే నష్టం గురించి ఒక సామాన్యుడు వింటే నోరెళ్లబెడతారు. అలాంటిది నిర్మాతలు అందరూ తమ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించేది మాత్రం ప్రప్రథమంగా హీరో ని, అతని స్టార్ డమ్ ని నమ్ముకునే అన్నది జగమెరిన సత్యం. ఇప్పుడు మన తెలుగు హీరోలు అందరూ రియల్ లైఫ్ లో తన హీరోయిజం చూపించాల్సిన సమయం ఆసన్నమయింది అని లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి పలువురు ఇండస్ట్రీ విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే బడా నిర్మాతల దగ్గర నుండి చోటామోటా నిర్మాతల వరకు అంతా ఫైనాన్షియర్ దగ్గర డబ్బులు తీసుకుని సినిమాలు చేసేవారే. హిట్ అయితే తిరిగి చెల్లిస్తారు లేదంటే వారి కష్టాలు వారు పడతారు అనుకోండి…. అది వేరే విషయం. కానీ ఎంతటి నిర్మాతకు అయినా లాక్ డౌన్ అతి పెద్ద దెబ్బ అని చెప్పాలి.

ఇంకా ఆలోచన రాలేదేమి?

ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సినిమాలను పట్టాలెక్కించేందుకు పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ఇక జగన్ అయితే ఇండస్ట్రీ వారికి బంపర్ ఆఫర్లు ఇచ్చేశాడు. పన్నుల మినహాయింపుతో పాటు ఏపీలో ప్రభుత్వ స్థలాలు షూటింగ్ కు ఉచితం అని చెప్పేశాడు. అయినా కానీ ఒక్క సినిమా కూడా చిత్రీకరణ మొదలు పెట్టలేదు. కరోనా భయం అటుంచితే ప్రస్తుతం నిర్మాతలు అందరికీ షూటింగ్ మళ్లీ మొదలుపెట్టేందుకు సరిపడా ధైర్యం హీరోలు ఇవ్వలేకపోతున్నారు. వారి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంతెందుకు ఇప్పటి వరకూ ఒక్క హీరో అయినా సినిమాలో తమ రెమ్యునరేషన్ ను తగ్గించుకుంటా అని ఒక్క నిర్మాత తో అయినా చెప్పాడా..? లేదా సినిమా లాభాల్లో వాటా వచ్చేలాగా డీల్ కుదుర్చుకుని ముందు షూటింగ్ కానివ్వండి అని భరోసా ఇచ్చాడా?

మాకేం అవసరం?

ఇక మొదట అతి ముఖ్యమైన కథానాయికుడి నుండి ఇటువంటి కమిట్మెంట్ వస్తే అప్పుడు డైరెక్టరు గాని.. టెక్నీషియన్లు గాని.. క్యార్క్టర్ ఆర్టిస్టులు గాని మరియు ఇతర విభాగాలు గాని ముందడుగు వేస్తారు అన్నది అందరికీ తెలిసిందే. చిరంజీవి , బాలయ్య లాంటి సీనియర్ హీరోలు , మహేశ్ఎన్‌టి‌ఆర్ లాంటి స్టార్ హీరో లలో ఒక్కరి కూడా సరికొత్త ట్రెండ్ ని మొదలుపెట్టలేకపోవడం సిగ్గు చేటు. ఇండస్ట్రీ మీద ప్రేమ ఒలకబోసెవీరంతా సినిమా రెమ్యూనరేషన్ లని తగ్గించుకోవడం ద్వారా నే మంచి సందేశం జనాల్లోకి పంపలేకపోవడం ఏమిటో అర్ధం కానీ పరిస్తితి. కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్ ఇప్పటికే ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది కానీ హీరోలు మాత్రం మాకేమీ తెలీదు అన్నట్టు ఉన్నారు.  అంతంత రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారే కాంప్రమైజ్ కాకపోతే ఇక మాకేం అవసరం అన్నట్లు మిగిలిన వారు ఉంటున్నారు. మంచి అయినా చెడు అయినా ముందు ఒకరు పూనుకుంటేనే తర్వాత జరగవలసిన తంతు అంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అయితే ఇప్పటివరకు ఒక్క హీరో కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. సినిమా ఆగిపోతే మాకు పోయేదేముంది…. ఇది కాకపోతే ఇంకో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి అన్న ధీమాతో ఉన్నారేమో కానీ ఎవరూ ప్రొడ్యూసర్ల బాధను అర్థం చేసుకోవట్లేదు అని సినీ వర్గాల్లో టాక్.

అతను దిగాల్సిందేనా..?

ఇప్పుడు విషయమై పూర్తి ఫోకస్ అంతా ఇండస్ట్రీలోని టాప్ హీరోలపై ఉంది. కొంత మంది స్టార్ హీరోలు అయితే నేరుగా చిత్రనిర్మాణంలో భాగస్వాములుగా ఉంటూ సినిమా విజయం సాధిస్తే అందులో కూడా అధిక మొత్తంలో షేర్ పొందుతున్నారు. ఇకపోతే వీరిలో అందరికన్నా బాధ్యత ఎక్కువగా ఉన్నది పవన్ కళ్యాణ్ మీదనే అని చెప్పాలి. ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకునే పవన్ కల్యాణ్ సొసైటీ పట్ల బాధ్యత గురించి ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. మరి సొసైటీ లో సినిమా లేదా ? సినిమా సొసైటీ ని ప్రభావితం చేయడా అనేది అతనే ఆలోచించుకోవాలి .. పార్టీ ఆర్థిక పుష్టి కోసం తాను మళ్ళీ సినిమాలు చేస్తున్నాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రజల శ్రేయస్సే తనకు ప్రప్రధానమైన అంశం అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మరి ప్రజల క్యాటగిరీ లోకి నిర్మాతలు వస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఇప్పటికే మూడు చిత్రాలు ఆయన ఓకే చేసేసారు. వాటిలో తన రెమ్యూనరేషన్ కూడా చాలా అధికం అని వార్తలు వస్తున్నాయి. సమయంలో పవన్ ఒక కీలకమైన ముందడుగు తీసుకుంటే అతని వెంట నలుగురు నడుస్తారన్నది నిర్మాతల ఆశ …. ఆకాంక్ష. . కానీ సరైన స్టాండ్ మాత్రం తీసుకౌయాట్లేదు పవర్ స్టారుడు ..

చివరి మాట: దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన చలన చిత్ర రంగం ఎంతో మందికి తెర వెనుక రంగులు పూసి తెర పైన అంగరంగ వైభవంగా ముస్తాబై ఎన్నో జీవితాలను రంగుల మయం చేస్తేకష్టకాలంలో దానిని ఆదుకునేందుకు రంగంలోకి దిగే వారే లేరా?

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju