NewsOrbit
బిగ్ స్టోరీ

పోస్టల్ ఓట్లు ట్రంప్‎ రీఎలక్షన్‎కు గండికొడతాయా?

ఎన్నికలు వాయిదా కోరుతున్న రిపబ్లికన్లు..కరోనా తగ్గాక ఎన్నికలు జరపాలంటూ ట్వీట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయపడుతున్నాడు…!

 

నవంబర్‎లో ఎన్నికల నిర్వహణ జరిగితే సమస్యలు వస్తాయంటున్నాడు. మెయిల్ ద్వారా ఓటింగ్ జరపడం వల్ల ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందంటూ ట్వీట్ చేశాడు. యూనివర్శల్ మెయిల్ ఓటింగ్ ద్వారా స్పష్టమైన ఎన్నిక జరిగే అవకాశం లేదని… స్పష్టమైన ఫలితం రాదని… కచ్చితత్వం ఉండదని… చరిత్రలోనే ఒక లోపభుయిష్టమమైన ఓటింగ్ జరుగుతుందంటున్నాడు. అది అమెరికా చరిత్రలోనే ఒక ఎంబరాస్మెంట్‎గా నిలుస్తుందని… దేశానికి చెడ్డపేరు తీసుకొస్తుందంటున్నాడు.

ఎన్నికలను వాయిదా వేయడం ద్వారా ప్రజలు ఒక పద్ధతి ప్రకారం, భద్రంగా, సురక్షితంగా ఓటు వేయోచ్చన్నాడు. జనవరి 20న కొత్త అధ్యక్షుడు పగ్గాలు చేపట్టడం అమెరికాలో అనవాయితీ. ఇందులో ఎలాంటి డిలే ఉండరాదన్నది అక్కడి నిబంధన. అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిపితే మంచిదన్న అభిప్రాయం డెమొక్రట్లతోపాటు, అక్కడ స్థానిక ప్రజల నుంచి వస్తోంది. సాధారణ ఓటింగ్ జరిగితే సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చేయడం కష్టమని… కరోనా ఉధృతి పెరుగుతుందని… కరోనాని తగ్గించడానికి పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని పెంచాలన్న విశ్లేషణలు ఎక్కువవుతున్నాయ్. అయితే ట్రంప్ నాయకత్వం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ మాత్రం ఈ వాదనను తిప్పికొడుతోంది. ప్రత్యక్షంగా ఓటేసే పద్ధతే అమెరికాకు మంచిదని… అలాంటప్పుడే ఎన్నికలు కచ్చితంగా నిర్వహించొచ్చని రిపబ్లికన్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో పోస్టల్ ఓటింగ్ ద్వారా ఎన్నిక జరిగితే ఫ్రాడ్ జరిగే అవకాశముందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. అమెరికా ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటి అవకతవకలు జరగలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. పోస్టల్ ఓటు వద్దంటూ రిపబ్లికన్లు వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని… ఓటర్లపై స్టెరాయిడ్లు ఉపయోగించడమేనంటూ డెమొక్రట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

దేశంలో పోస్టల్ ఓటింగ్ జరిగితే అమెరికాలో మరెవరూ కూడా రిపబ్లికన్ అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ ఉండదంటూ ట్రంప్ ఓపెన్‎గానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా తన ఎన్నికకు సంబంధించి జరగబోయే ఓటింగ్ విషయంలో ట్రంప్ భయంకరమైన గందరగోళంలో ఉన్నారు. గతంలో రష్యా ప్రభావం వల్లే ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారని, హిల్లరీ క్లింటన్ గెలవకుండా కుట్ర చేశారన్న విమర్శలు ఎక్కడ వెల్లువెత్తాయ్. తాజాగా ఇప్పుడు దేశంలోనే ఓటింగ్ జరిగినా… ఆ ఓటింగ్ లోపభుయిష్టంగా జరుగుతుందంటూ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేస్తుంటే… మరోసారి అధ్యక్షుడిగా ఆయన గెలవడం అనుమానమే అనుకోవాలి.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju