NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: జగన్ ఒక్కోసారి మీ మైండ్ లో ఎవరు దూరుతారు..!? వహ్వా శెభాష్ నిర్ణయం..!!

YS Jagan: మద్యం ధరలు పెంచిన అవకాశం వాది.. అవును “అమ్మ ఒడితో ఆదుకుంటున్న ఇంటి పెద్దన్న..

బాబాయి మర్డర్ తేల్చలేని అసమర్ధ వాది.. అవును “దిశా చట్టంతో దేశానికి నిర్దేశం చేసిన ఆడపిల్లల అన్నయ్య..

ప్రాజెక్టులు కట్టలేని అపరిపక్వ పాలకుడు.. అవును “పేదలకు పథకాలతో అభిషేకం చేస్తున్న పేదల బంధువు..

జగన్ ఏం చేసినా మంచీ చెడులు ఉంటాయి. జగన్ అనే కాదు… ఎన్టీఆర్ అవ్వనీ.., వైఎస్ అవ్వనీ.., చంద్రబాబు అవ్వనీ.. ఎవరు పాలనలో ఉన్నా మంచీ, చెడులు వెతికే వారు ఉంటారు. అయితే ఇప్పట్లో సోషల్ మీడియా అనే పైత్యం ఎక్కువగా ఉంది కాబట్టి.. మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారంలో ఉంటాది. జగన్ లో మంచీ, చెడు ఉంటె ఉండొచ్చు గాక.. పాలనలో లోపాలు ఉంటె ఉండొచ్చు గాక.. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి. ఒక్కోసారి ఆయనేనా..!? ఆయన మైండ్ లో ఎవరు దూరుతారు..!? ఇంత మంచి నిర్ణయం ఎలా..!? అనే సందేహాలు కూడా వస్తుంటాయి. ప్రత్యర్ధులు కూడా మెచ్చుకునేలా నిర్ణయాలు ఉంటాయి.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం అటువంటిదే..

YS Jagan: Sensational Decisions as CM
YS Jagan Sensational Decisions as CM

YS Jagan:  అనాధలైతే పది లక్షలు ఫిక్స్డ్..!

కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణిస్తే.. ఆ పిల్లల పేరిట రూ. పది లక్షలు ఫిక్సడ్ డిపాజిట్ చేయాలని నిన్న ఆయన తీసుకున్న నిర్ణయం భేష్.. ఇది ఎవ్వరికీ రాని ఆలోచన. ఎవ్వరూ తీసుకోలేని నిర్ణయం. ఏపీ మాత్రమే ఈ తరహా నిర్ణయం తీసుకుని అమలు చేయడానికి పూనుకుంది. అందుకే జగన్ పాలనలో కొన్ని మెరుపులు ఉంటాయి. వాటిని మిస్ కాకుండా చూసుకుని, మురిసిపోవాల్సిందే.

* 2019 లో దిశా ఘటన జరిగినప్పుడు .. హుటాహుటిన మన రాష్ట్రంలో దిశా చట్టాన్ని తీసుకొచ్చి.. దాన్ని అమలు చేసేలా కేంద్రానికి బిల్లు చేసి పంపించిన సందర్భం ఏపీని దేశంలో ఓ స్థాయిలో నిలబెట్టింది.
* విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 29 మంది మరణించినప్పుడు వారికి. ఇరవయ్యో.. ముప్ఫయ్యో పరిహారం ఇస్తారేమో అనుకున్న వేళా.. కారణాలు ఏవైనా ఏకంగా రూ. కోటి పరిహారం ఇవ్వడం ఊహించని పరిణామం. ఆ కుటుంబాల బాధని కొంత తీర్చింది.

YS Jagan: Sensational Decisions as CM
YS Jagan Sensational Decisions as CM

* బ్లాక్ ఫంగస్ విజృంభణ మొదలైన వెంటనే దాన్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడం.. గత ఏడాది కూడా కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీ లోకి తీసుకురావడం ఏపీకే చెల్లింది..!
* అయితే ముందు చెప్పుకున్నట్టు అనేక మరకలు కూడా ఉన్నాయి. రాజకీయ కోణంలో చూస్తే అవన్నీ తప్పు పట్టాల్సినవే. దేనికవే ప్రత్యేకమైనవి. రాజకీయాలను పక్కన పెట్టి ఆలోచిస్తే మాత్రం జగన్ తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రత్యర్థులకు కూడా షాక్ కలిగిస్తాయి.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju