సినిమా

Bangarraju Movie: బ్రేక్ ఈవెన్‌కి చేరువ‌లో `బంగార్రాజు`.. 11 డేస్ క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

Share

Bangarraju Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం `బంగార్రాజు`. యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. కృతి శెట్టి, ర‌మ్య‌కృష్ణ హీరోయిన్లుగా న‌టించారు. అన్నపూర్ణా సినీ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిత‌మైన ఈ సినిమా 2016లో విడుదలై ఘ‌న విజ‌యం సాధించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రానికి సీక్వెల్‌.

ఈ మూవీనికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి పండ‌గా కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌లై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఫ‌స్ట్ వీక్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను వ‌సూల్ చేసిన ఈ సినిమా.. సెకెండ్ వీక్ వ‌చ్చే స‌రికి క‌రోనా దెబ్బ‌కు బాగా వీకైపోయింది. అయిన‌ప్ప‌టికీ బ్రేక్ ఈవెన్‌కి చేరువ‌వుతున్న ఈ చిత్రం.. 11వ రోజు రూ.36 లక్షల షేర్ ని మాత్రమే రాబ‌ట్టింది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా బంగార్రాజు 11 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం- 7.97 కోట్లు
సీడెడ్- 6.38 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌- 4.81కోట్లు
తూర్పు గోదావ‌రి- 3.86 కోట్లు
పశ్చిమ గోదావ‌రి- 2.73 కోట్లు
గుంటూరు- 3.24 కోట్లు
కృష్ణ- 2.10 కోట్లు
నెల్లూరు- 1.66 కోట్లు
——————————————————————
ఏపీ+తెలంగాణ క‌లెక్ష‌న్‌- 32.75కోట్లు(53 కోట్లు~ గ్రాస్)
——————————————————————

క‌ర్ణాట‌క+ రెస్ట్ ఆప్ ఇండియా- 1.69 కోట్లు
ఓవ‌ర్సీస్‌ – 1.43 కోట్లు
—————————————————————————
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌- 35.87కోట్లు(60.10కోట్లు~ గ్రాస్‌)
—————————————————————————

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. రూ.39 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. ప్ర‌స్తుతం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 3.13 కోట్లను రాబ‌ట్టాల్సి ఉంటుంది. కానీ, ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిల్లో అంత వ‌సూల్ చేయ‌డం క‌ష్ట‌మే అని సినీ పండితులు అంటున్నారు.


Share

Related posts

ఈసారి భారీ యాక్ష‌న్‌

Siva Prasad

SreeMuki Beautiful Pics

Gallery Desk

Tollywood: నాలుగు సినిమాలు ఒకేసారి చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar