బాహుబలి లెక్కలు తిరగరాస్తున్న కన్నడ సినిమా…

కన్నడ సినీ చరిత్రలో 80కోట్ల భారీ బడ్జట్ తో తెరకెక్కిన సినిమా ‘కెజీఎఫ్’. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. రీజినల్ సినిమాకి ఉండే సత్తాని ప్రపంచానికి పరిచయం చేస్తూ ‘కెజీఎఫ్’ ఇప్పటి వరకు దాదాపు 219 కోట్ల గ్రాస్ రాబట్టింది.

టీజర్ బయటికి వచ్చినప్పటి నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టిన చిత్ర యూనిట్, ట్రైలర్ తో అదిరిపోయే ఫీడ్ బ్యాక్ తెచ్చుకొని సినిమాలో ఏదో విషయం ఉందనే ఫీలింగ్ కలిగించారు. పాన్ ఇండియా రిలీజ్ అయిన కెజీఎఫ్, ప్రొమోషన్స్ ని చాలా జాగ్రత్తగా చేసి ప్రణాళిక ప్రకారం విడుదల చేశారు. మొదటి షో నుంచే అన్ని ఇండస్ట్రీల నుంచీ హిట్ టాక్ తెచ్చుకోని బాక్సాఫీస్ లెక్కలు మార్చాడు.

ఇప్పటి వరకూ కేవలం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే 121 కోట్లు రాబట్టిన కెజీఎఫ్, శాండల్ వుడ్ ఇండస్ట్రీలో 100కోట్లు వసూళ్లు చేసిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి డబ్బింగ్ వెర్షన్ 129 కోట్లు రాబట్టింది, మరో వారం గడిస్తే కెజీఎఫ్ సినిమా బాహుబలి రికార్డులని చెరిపేసి కన్నడ గడ్డపై కొత్త  చరిత్ర సృష్టించడానికి సిద్దమవుతుంది. సినిమాలో విషయం ఉంటే, ఇండస్ట్రీ ఏదైనా సరే ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారని ప్రూవ్ చేసిన ‘కెజీఎఫ్’ బాటలో మరిన్ని చిత్రాలు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చే అవకాశం ఉంది.