వర్మ మాయలో లక్ష్మీ పార్వతి

ఎవరి పాటికి వారు రామారావు పేరు వాడుకుంటూ సినిమాలు చేస్తున్నారు.  రామ్ గోపాల్ వర్మ, ఎన్టీఆర్ ఆత్మ తనతో చెప్పింది అనే మాటని వాడుకుంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని పబ్లిసిటీ చేసుకుంటుంటే, లక్ష్మీ పార్వతినే టార్గెట్ చేసి కేతి రెడ్డి తీస్తున్న  ‘లక్ష్మీస్ వీరగ్రంథం’  చిత్ర యూనిట్ మాత్రం ఏకంగా అన్నగారి ఆత్మనే దించారు.  ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా నుంచి సెకండ్ టీజర్ బయటకి వచ్చింది. ఈ టీజర్ లో నాదెండ్ల భాస్కర్, ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉన్నా కూడా లక్ష్మీ పార్వతి నిమ్మకు నీరెత్తినట్లు ఉందని, ఆమెకి అధికారం కట్టబెట్టడం కోసం కుటుంబాన్ని కూడా దూరం చేసుకున్న అన్నగారు, ఆత్మ రూపంలో  లక్ష్మీ పార్వతికి భారీ సందేశమే పంపించాడు. కేతిరెడ్డి మాత్రమే తన అసలైన శిష్యుడని, తన ఆశీర్వాదం కేతిరెడ్డికి తప్పకుండా ఉంటుందని చెప్పడం కొసమెరుపు.