NTR: “RRR” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ లైనప్ కేక పుట్టించేస్తుంది. పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం తారక్ “RRR” రూపంలో ఇండస్ట్రీ హిట్ అందుకోవటం తెలిసిందే. దీంతో “RRR” తర్వాత తన కెరియర్ లో 30వ సినిమా ప్రస్తుతం కొరటాల శివ తో చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రాజమౌళి తో చేసిన తర్వాత చేయబోతున్న సినిమా కావటంతో స్టోరీ ఇంకా అన్ని విషయాలలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ సినిమా ఓకే చేయటం తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్ బర్త్ డే నాడు ప్రశాంత్ నీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ చాలా వైలెంట్ గా ఉంది. ఈ తరుణంలో ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా టైటిల్ “అసురుడు” అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టైటిల్ కి తగ్గట్టుగానే సినిమాలో చాలావరకు తారక్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్ లో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
“జై లవకుశ” సినిమాలో ఎన్టీఆర్ నటించిన నెగిటివ్ పాత్ర మాదిరిగానే ..ప్రశాంత్ నీల్ ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమానీ తారక్ ఓకే చేసినట్లు, ఈ సినిమాని దిల్ రాజు ఒప్పుకున్నట్లు లేటెస్ట్ న్యూస్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంమీద చూసుకుంటే “RRR” తర్వాత చాలా వరకు ఎన్టీఆర్ ఒప్పుకుంటున్న ప్రాజెక్టులు పాన్ ఇండియా నేపథ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.