పవన్‌కల్యాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ తరుణంలో కొందరు జనసేనాని తన పదవిని వదులుకుని సినిమాల్లోకి వస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలను పుట్టించారు. ఈ వార్తలపై జనసేన పార్టీ వివరణ ఇచ్చింది. పవన్‌కల్యాణ్ సినిమాల్లోకి రావడం లేదని, ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉంటారని అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. పవన్‌కల్యాణ్‌పై అసత్య ఆరోపణలు చేయడం, తప్పుడు వార్తలు పుట్టించడం వంటివి చేస్తే తాము లీగల్‌గా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రజాసేవలోనే పవన్ ఉంటారనే విషయం మంచిదే అయితే, ఆయన్ని తెరపై మళ్లీ చూసే అవకాశం ఉంటుందనుకొన్న ఆయన డైహార్డ్ ఫ్యాన్స్‌కు మాత్రం ఇది నిరాశ కలిగించే అంశమే.