(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ముంబై ఒఎన్జిసికి చెందిన ఆయిల్ – గ్యాస్ ప్రాసెసింగ్ యూనిట్లో మంగళవారం ఉదయం భారీ ఆగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబై సమీపంలోని ఉరన్ వద్ద ఉన్న ప్లాంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు దాని చుట్టుపక్కల కిలోమీటర్ దూరం వరకూ సీలు చేశారు.
ముంబైకి ఈ యూనిట్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదం కారణంగా ప్లాంట్‌లో చమురు ప్రాసిసెంగ్‌కు ఆటంకం కలగలేదని ఒఎన్‌జిసి ఒక ట్వీట్లో తెలిపింది. అయితే అగ్నిప్రమాదం ఫలితంగా ప్లాంట్‌కు వచ్చే గ్యాస్‌ను గుజరాత్‌లోని హజీరా ప్లాంట్‌కు మళ్లించినట్లు ఒఎన్‌జిసి తెలిపింది. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలు బయటకు కనబడుతున్నాయి.
A fire broke out in storm water drainage early morning 2day in Uran oil & gas processing plant.ONGC fire services & crisis managemnt team immediately pressed in2 action. Fire is being contained. No impact on Oil processing.Gas diverted to Hazira Plant. Situation is being assessed
— ONGC (@ONGC_) September 3, 2019