Pushpa: గత కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా అల్లు అర్జున్ పేరే వినబడుతోంది. దానికి కారణం పుష్ప సినిమా అని మనం వేరే చెప్పనక్కర్లేదు. మొదట్లో సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా, రాను రాను పుంజుకొని సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. విడుదలైన దాదాపు అన్ని భాషల్లో అంటే.. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీలలో కూడా మంచి టాక్ తెచ్చుకొని కరోనా కష్టకాలంలో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం విశ్వసనీయ వర్గాల లెక్కల ప్రకారం 300 కోట్ల వరకు దక్కించుకుందని టాక్.
Mohan babu: ‘నీ వల్ల కాకపోతే నేను ఉన్నా!’ చిరంజీవికి ఝలక్ ఇస్తూ రంగంలోకి దిగిన మోహన్ బాబు!
Pushpa: హిందీలో దుమ్ములేపిన పుష్ప రాజ్!
అవును.. మన తెలుగునాటే కాకుండా పుష్ప హిందీలో కూడా దుమ్ము లేపాడు. ప్రస్తుతం పుష్ప నిర్మాతలు సేఫ్ జోన్లో వున్నారు. కనుక పుష్పకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అయితే తాజాగా పుష్ప గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విషయంలోకి వెళితే, పుష్ప సినిమా 2021 లో విడుదల అయిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. నిన్న మొన్నటివరకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సినిమా నెం.1 గా నిలిచింది. ఇపుడు పుష్ప 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూర్యవంశీని ఢీకొట్టాడు పుష్ప రాజ్.
Red Chilli: ఈ గింజలతో కీళ్ల నొప్పులు క్షణాల్లో మటుమాయం..!!
ఇంతవరకు బాలీవుడ్లో పుష్ప రాబట్టిన బాక్షాఫీస్ కలెక్షన్లు ఇవే..
ప్రస్తుతం అక్కడ 50 కోట్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, బెంగళూరు ఇలా అన్ని చోట్ల కూడా భారీగా వసూళ్లు నమోదు చేస్తూ ఇంకా జోరుమీదే ఉందని మార్కెట్ వర్గాల సమాచారం. ప్రస్తుత కరోనా వేరియంట్ కారణంగా పలు రాష్ట్రాల్లో థియేటర్లు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇక పుష్ప విడుదల అయిన రెండు మూడు వారాల తర్వాత కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ను దక్కించుకోవడం విశేషం.