భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచిన సినిమాలలో “RRR” ఒకటి. ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అనేక రికార్డులు సృష్టించటం జరిగింది. “RRR” థియేటర్ లో మాత్రమే కాదు ఓటీటీలో కూడా అనేక సంచలనాలు సృష్టించటం జరిగింది. చాలామంది హాలీవుడ్ దర్శకులు టెక్నీషియన్స్ దర్శకుడు రాజమౌళి ప్రతిభను పొగడటం జరిగింది. ఇక ఇద్దరు హీరోలు చరణ్, తారక్ నటనని కూడా చాలామంది ఆస్వాదించారు. దేశాలకు ప్రాంతాలకు అతీతంగా “RRR” సత్తా చాటింది. అటువంటి ఈ సినిమాపై కాంట్రవర్సిటీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“RRR” సినిమా తనకి సర్కస్ మాదిరిగా అనిపించిందని చెప్పుకొచ్చారు. సర్కస్ చూస్తున్నప్పుడు ఎలాంటి ఆనందం… ఆసక్తి కలుగుతుందో “RRR” సినిమా చూస్తున్నంత సేపు అదే ఫీలింగ్ కలిగినట్లు చెప్పుకొచ్చారు. వంతెన దగ్గర బాలుడిని కాపాడే సన్నివేశంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ “జెమినీ సర్కస్” చేసినట్లు అనిపించిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ మరియు మెగా ఫాన్స్ మండిపడుతున్నారు.
మీకు సినిమా సర్కస్ లాగా అనిపించింది కాబట్టే ప్రపంచంలో అనేక రికార్డులు ఈ సినిమా క్రియేట్ చేసిందని.. కొంతమంది కౌంటర్లు వేస్తున్నారు. “RRR” ప్రపంచంలో మరికొన్ని దేశాలలో విడుదల చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. త్వరలో జపాన్ దేశంలో రిలీజ్ చేయనున్నట్లు అక్టోబర్ నెలలో విడుదల కానున్నట్లు సమాచారం. జపాన్ దేశంలో బాహుబలి బ్లాక్ బస్టర్ విజయం సాధించటంతో ఆ ఎఫెక్ట్ తో “RRR” రాజమౌళి విడుదల చేయించనునట్లు సమాచారం.