Samantha: సమంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. పడిలేచిన కెరటం లాంటిది హీరోయిన్ సమంత. అవును.. అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం అంతా సామ్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. మునిపటికంటే ఆమె ఇపుడు జెట్ స్పీడుతో సినిమాలలో ఆఫర్లను సొంతం చేసుకొంటోంది. దీనికి కారణం ఆమె ఎంచుకున్న సినిమాలే. ఫామిలీ మ్యాన్ II తరువాత సామ్ నటన పరంగా మరో మెట్టు పైకి ఎక్కింది. ఈ క్రమంలోనే వచ్చిన పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ ‘ఉ అంటావా, ఊఊ అంటావా’ అనే పాట సామ్ లోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పాంచ్ పటాకా అంటోన్న సమంత:
దాంతో డిఫరెంట్ జోనర్స్ కధలు అమ్మడు తలుపు తడుతున్నాయి. ఇకపోతే సోషల్ మీడియాలో సామ్ ఎంత ఏక్టివ్ గా ఉంటుందో చెప్పనవసరం లేదు కదా. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో సామ్ మంచి ఫిట్ గా కనబడుతోంది. అంతేకాకుండా రెండు చేతులకి గ్లౌజెస్ తొడుక్కొని బాక్సింగ్ కి వెళ్లే యోధురాలిలాగా కనబడుతోంది. ఈ క్రమంలో ఫిట్ గా ఉండటానికి ఆమె పాఠాలు కూడా చెబుతందండోయ్. అవేమంటే ఆమె ఎక్కువగా బరువులు ఎత్తుతుందట అలాగని యానిమల్ ప్రొటీన్ తీసుకోదట. కేవలం పచ్చదనం(గ్రీన్) నిండిన ఆహారాన్ని మాత్రమే తినేందుకు ఇష్టపడుతుందట. మనల్ని కూడా అలాగే చేయమంటోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సినిమా కోసమా?
ఐతే సదరు ఫోటోని చూసిన నెటిజన్లు మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సమంత పైన. అదేమంటే, బాక్సింగ్ ప్రాక్టీస్ దేనికోసం? అని ఒకరు ప్రశ్నిస్తే, సినిమాలో విలన్ల భరతం పడతావన్నమాట అని ఇంకొకరు అంటున్నారు. మరికొందరైతే.. ఓ అడుగు ముందుకేసి, చైతన్యతో ఎన్ని సార్లు గొడవ పడ్డారు అని కొంటె ప్రశ్నలు వేస్తున్నారు. వాటన్నిటికీ సామ్ నవ్వుతూనే సమాధానాలు ఇస్తోంది. ఇక సమంత నటిస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. యశోద అనే లేవీ ఓరియేంటెడ్ మూవీ తాలూక టీజర్ ఇటీవలే రిలీజై మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటోంది. హరి శంకర్-హరీష్ అనే ఇద్దరు దర్శకులు దీన్ని తెరకెక్కిస్తున్నారు.