Pushpa 2: 2021 డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఈ సినిమా మంచి పాపులారిటీ సంపాదించింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి ప్రమోషన్ చేయకపోయినా గాని ₹100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరచడం జరిగింది. సినిమా రిలీజ్ ఏడాదికి పైగా కావస్తున్న ఈ సినిమాలో డైలాగులు మరియు పాటలు ఇప్పటికీ కూడా ట్రెండ్ సెట్టర్ గా సోషల్ మీడియాలో ఉన్నాయి.
అయితే సినిమా విడుదల ఏడాదిపైగా కావస్తున్నా గాని సెకండ్ పార్ట్ షూటింగ్ జరుగుతుందో లేదో అభిమానులలో ఆందోళన నెలకొంది. ఆమధ్య సెకండ్ పార్ట్ షూటింగ్ ఐదు రోజులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల హీరోయిన్ రష్మిక మందన ఫిబ్రవరి నుండి పుష్ప సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ ఏకధాటిగా జరగనున్నట్లు స్పష్టం చేసింది. కాగా “పుష్ప” మొదటి భాగంలో విలన్ పాత్రలో మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఫహద్ ఫాజిల్…నీ చూపించడం తెలిసిందే. అయితే రెండో పార్ట్ విలన్ కి సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా మాత్రం జగపతిబాబు… ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సుకుమార్ డిసైడ్ అయినట్లు సమాచారం.
గతంలో సుకుమార్ దర్శకత్వంలో.. రంగస్థలం, నాన్నకు ప్రేమతో సినిమాలో జగపతి బాబు విలన్ పాత్రలు చేయడం తెలిసిందే. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ మరింత గ్రాండ్ గా స్క్రిప్ట్ సిద్ధం చేసి ప్రత్యేకంగా జగపతిబాబు పాత్రని చాలా హైలెట్ గా చూపించనున్నట్లు.. ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో పుష్ప రెండో భాగం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందట. మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువ భాషలలో రిలీజ్ చేసే తరహాలో నిర్మాతలు డిసైడ్ అయినట్లు సమాచారం.