Eenadu Ramojirao: 84 ఏళ్ళ వయసులో ఎన్ని తిప్పలో..!? స్థాయి మరచి అతి భజన..! “ఈనాడు రామోజీ” లేఖ..!!

Eenadu Ramojirao: Letter with Over Biscuits to KTR
Share

Eenadu Ramojirao: ఆయన పద్మ విభూషణ్.. వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపది.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.., జాతీయస్థాయిలో వన్నె తెచ్చుకున్న వ్యాపార ఘనుడు.. పైగా 84 ఏళ్ళ కురువృద్ధుడు/ అన్నీ చూసేసిన అనుభవశాలి..! అటువంటి రామోజీరావు ఈరోజు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాసిన లేఖ ఒకటి ఆయన్ను విమర్శలపాలు చేస్తుంది. కేటీఆర్, కేసీఆర్, టీఆరెస్ అంటే ఈనాడుకు భయమో/ భక్తో/ భజనో ఉంటె ఉండవచ్చు.. కానీ అది బహిరంగపరచడం.., అందులో బీభత్సమైన అతిశయోక్తులు ఉండడం.., పైగా ఇవి అతిశయోక్తులు కాదంటూ బిస్కట్ స్థాయికి మించి కేటీఆర్ కి బిస్కట్లు వేయడం భజనలు చేయడం రామోజీ స్థాయిని చాలా మెట్లు దిగజార్చింది..!!

Eenadu Ramojirao: Letter with Over Biscuits to KTR
Eenadu Ramojirao: Letter with Over Biscuits to KTR

ఈ రోజు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటిఆర్) 45వ జన్మదినోత్సాన్ని జరుపుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఆయన బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకోవడం లేదు. అది వేరే విషయం అనుకోండి. అయితే ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు, సన్నిహితులు, పారిశ్రామక వేత్తలు, ప్రముఖులు ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం సహజం. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి, అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కావడంతో పై వారితో పాటు ఆయనతో పనులు ఉన్న వాళ్లు, భవిష్యత్తులో అవసరం ఉంటుంది అనుకున్న వాళ్లు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే చాలా మంది ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పడమో లేకపోతే దగ్గరలో ఉంటే కలిసి విసేష్ చెప్పడమో లేక సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంటుంది. ఇందులో పెద్ద విశేషం అయితే ఏమీ లేదు.
తెలుగు రాష్ట్రాల్లో మీడియా మోఘల్ గా పేరుగాంచిన మరియు తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ గా ఉండి ఓ పెద్ద సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్న “ఈనాడు ఈటీవీ” సంస్థల అధినేత రామోజీ రావు గారు కేటిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన విధానం అనేక రకాలుగా చర్చనీయాంశమైంది. కొత్త ఆలోచనలను సృష్టిస్తోంది. రామోజీరావు గారి స్థాయి తగ్గించుకుని దిగజారారా లేక కేటిఆర్ స్థాయి అంత పైకి ఎదిగిపోయిందా లేక అందరిలా రామోజీరావు అవసరార్ధం ఏదో పని ఉంది కాబట్టి పట్టు పరిశ్రమవిధానానికి నాంది పలికారా అని కొత్త అనుమానాలు వస్తున్నాయి.

Eenadu Ramojirao: Letter with Over Biscuits to KTR
Eenadu Ramojirao: Letter with Over Biscuits to KTR

Eenadu Ramojirao: రామోజీ కొత్త నాంది..! కొన్ని దశలు దాటి..!!

మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు, అధికార పార్టీకి వత్తాసు పలకడం సహజమే. రాజకీయ పార్టీలకు భజన చేయడమూ సహజమే. అందులో ఈనాడుది అందే వేసిన చేయి.. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ జాగ్రత్తగా అంటి మున్నట్లుగా వ్యవహరిస్తారు. అదే తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వమే తనది అన్నట్లు ఫీల్ అవుతుంటారు. టీడీపీ అనుబంధ పత్రిగా పేరు తెచ్చుకున్న ఈనాడు ఏపిలో వైసీపీకి వ్యతిరేకంగా రాయడం లేదు. అంటే మేము నూట్రల్ అనే బిల్డప్ ఇస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు అనుకూలంగా మారింది అనేది చెప్పాల్సిన పని లేదు. అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాలు అన్ని ఎందుకంటే ప్రభుత్వాలను శాసించే స్థాయిలో, చక్రం తిప్పగల స్థాయిలో ఉన్న ఈనాడు అధినేత రామోజీరావు మంత్రి కేటిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ రోజు ముందుగానే శుక్రవారం నాడు యువ రాజకీయ వేత్తకు తన దైన శైలిలో గ్రీటింగ్స్ తెలియజేయడం అందరికీ ఆశ్చర్యం కల్గించడంతో పాటు రాజకీయ వర్గాల్లో ఇదో పెద్ద చర్చనీయాంశమవుతోంది.

Eenadu Ramojirao: Letter with Over Biscuits to KTR
Eenadu Ramojirao: Letter with Over Biscuits to KTR

బీభత్సమైన అతిశయోక్తులు..!!

కేటీఆర్ ని “తండ్రిని మించిన తనయుడు” అని కీర్తించడంతో పాటు జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా కేటిఆర్ రాణించాల్సిన అవసరం ఉందని రామోజీ అభిప్రాయపడుతూ పంపిన ప్రత్యేక సందేశం కేటిఆర్ తో సహా అందరినీ ఆకట్టుకుంది. తండ్రిని మించిన సందర్భం ఎక్కడ కనిపించింది..!? మాటల్లోనా.,.? చేతల్లోనా…!? జాతీయ స్థాయిలో కేటీఆర్ వంటి నాయకుడు లేరట. పైగా ఈ మాట అతిశయోక్తి కాదట..! రామోజీరావు స్థాయి చూసుకున్నట్లయితే ఆయన ఒక పద్మవిభూషన్, ఒక మీడియాతో అనేక వేల కోట్ల సామాజ్రానికి అధిపతిగా ఉంటూ దేశంలో, రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరైన రామోజీ తన స్థాయి తగ్గించుకుని ఒక కేబినెట్ మంత్రి అయిన కేటిఆర్ ను ఇంతగా పొగడం ఏమిటి అనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇబ్బందులలో నుండి గట్టెంచుకునేందుకు అధికార పార్టీ మద్దతు అవసరమని భావించే ఈ విధమైన భజన చేసి ఉండవచ్చునని పబ్లిక్ టాక్. లేదా రామోజీ పేరు పెట్టుకుని.. ఆయన కుమారుడు ఈనాడు ఎండీ కిరణ్ రాసుకున్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..! నిజంగా రామోజీ నే ఈ లేఖ రాస్తే మాత్రం ఆయన కేటీఆర్ ని మరీ ఇంతగా పొగడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు..!!


Share

Related posts

Tirupathi RUIA: రుయా సీక్రెట్లు భయపెడతాయ్.. ఎక్కడో వైఫల్యం వెంటాడుతున్నట్టే..!!

Srinivas Manem

AP High Court: జగన్ కి దెబ్బ – అమరావతికి ఊపిరి..! రాజధాని కథ @ మళ్ళీ నవంబరుకి..!!

Srinivas Manem

YS Viveka Case: థర్డ్ డిగ్రీ.. లై డిటెక్టర్.. వివేకా కేసులో సీబీఐ దూకుడు..!!

Srinivas Manem