NewsOrbit
5th ఎస్టేట్

టివి 9 కి మరోసారి ఛీ కొట్టించుకుంది…!

కొన్ని మీడియా చానెళ్లు, పత్రికలు తమ వార్తా కథనాలతో అనేక సార్లు ప్రజాగ్రహానికి గురవుతుంటాయి. ఛీ కొట్టించుకుంటాయి. పత్రికల్లో ఆంధ్రజ్యోతి ఎక్కువగా ఈ కోవకు చెందుతుండగా, ఛానెళ్లలో టివి 9 ఇదే కోవకు చెందుతుంది. తాజాగా ఈ ఛానెల్ ఒక బ్లండర్ తప్పుడు వార్తని ప్రసారం చేసి అడ్డంగా దొరికేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు టివి 9 ని ఆడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇవన్నీ ఆ ఛానెల్ కు సహజమే అయినా ఈ పొరపాటు కారణంగా చెరిగిపోలేని మచ్చ వేసుకుంది. ఏమయ్యిందో? ఆ ఛానెల్ చేసిన పొరపాటు ఏమిటో? తప్పుడు వార్తా ఏమిటో చూద్దాం రండి.

ఏడాది కిందట జరిగినది తాజాగా జరిగినట్టు…!

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో భగీరథ కెమికల్స్ అని ఒక రసాయన ఫ్యాక్టరీ ఉంది. అక్కడి రసాయనాలు నీటిలో కలిసిన కారణంగా స్థానికులు ఆ నీటిని తగలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కిందట ఆ గ్రామస్థులు అందరూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసారు. ఆందోళనలు చేసారు. నీళ్ల బాటిళ్లు తెచ్చి కలెక్టర్ కి చూపించారు. కలెక్టర్ ఒక కమిటీ వేశారు. ఆ నీటిని శుద్ధి చేసేలా వేరే బోరు ఏర్పాటు చేసారు. ఆ సమస్య పరిష్కారం జరిగిపోయింది. ఇప్పుడు టివి 9 లో ఈ ఆందోళన , ధర్నాలు మొన్న జరిగినట్టు వార్తా ప్రసారం చేశారు. విశాఖలో జరిగిన ఘటన కారణంగా ఒంగోలులో కూడా స్థానికులు ధర్నా చేశారు అంటూ ఇస్మార్ట్ న్యూస్ లో ప్రసారం చేసారు. అసలు జరగని దాన్ని, ఎప్పుడో ఏడాది కిందట జరిగిన అంశాన్ని తాజాగా జరిగినట్టు, విశాఖ ప్రమాదంతో ముడి పెట్టడాన్ని ఒంగోలు, ప్రకాశం జిల్లా వాసులు గుర్తించారు. ఈ ఛానెల్ కి ఏమి లేదు, అంటూ ఛీ కొట్టుకుంటున్నారు.

ఎందుకో అంత యావ…!

సాధారణంగా వార్త పత్రికలు, చానెళ్లు సంచలనాల కోసం చూస్తుంటాయి. అందరి కంటే తామే ప్రత్యేకంగా ఉండాలి, ముందు ఉండాలి అనే యావతో కనీస స్పృహ కోల్పోయి, ఇంగితం మర్చిపోయి ఒక్కోసారి వార్తలు ప్రసారం చేస్తుంటాయి. ఆ క్రమంలోనే ఇటువంటి బ్లండర్ చేస్తుంటాయి. “నిజానికి ఒంగోలులో ఆ ఫ్యాక్టరీ వలన ఇబ్బందులను ప్రసారం చేయాలి అంటే వేరే మార్గం ఉంది. ఇబ్బందులను స్థానికుల చేత చెప్పించి, ఇలా రసాయన ఫ్యాక్టరీ అని ఇవ్వవచ్చు. కానీ అలా కాకుండా విశాఖ ఘటనపై ఏడాది ముందు జరిగిన ఒక ధర్నా, ఆందోళన విడియోల్ను తాజాగా జరిగినట్టు చూపించి.., తాము అందరి కంటే ముందున్నట్టు అభాశుభాలపాలయ్యింది.” కేవలం టి ఆర్ పి ల కోసమే పని చేసే టివి 9 లో ఇటువంటి వార్తలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ ఛానెల్ టి ఆర్ పి కూడా ఒక పెద్ద మాయ. అది మరో సందర్భంలో చెప్పుకుందాం.

 

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment