Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్‌కి మూడో పదవి..! ఎలాగైనా మాట నిలబెట్టుకున్న జగన్..! ఈ సారి ఢోకా లేనట్టే – సేఫ్ పదవి..!!

Share

Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్ పేరు విన్నారు కదా..ఈ పేరు రాష్ట్రంలోని రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా తెలుసు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి రిటైర్ అయ్యాయి. ఆయనతో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఏ విధమైన బంధం ఉందో కానీ రాష్ట్రంలో ఓ కీలకమైన పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ మేరకు ఆయనకు హామీ ఇచ్చారు. గతంలో రెండు పదవులు జగన్ సర్కార్ ఇచ్చినా న్యాయపరమైన చిక్కుల కారణంగా అ పదవులు మూడునాళ్ల ముచ్చట అయ్యాయి. ఇప్పుడు జగన్ సర్కార్ ఆయనకు మరో పదవి ఇచ్చింది. అది ఎలా అంటే..

Justice Kanagaraj appointed in pd act committee
Justice Kanagaraj appointed in pd act committee

 

Justice Kanagaraj: పీడీ యాక్ట్ సలహా మండలి సభ్యుడుగా..

ఏపి ప్రభుత్వం తాజాగా పీడీ యాక్ట్ కేసుల పర్యవేక్షణకు ఓ సలహా మండలిని ఏర్పాటు చేసింది. ప్రివెంటివ్ డిటెక్షన్ (పీడీ యాక్ట్) చట్టం 1955లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ లు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తుంటారు. అయితే కలెక్టర్ లు నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసులు పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సలహా మండలిని నియమించింది. అందులో ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తులను సభ్యులుగా నియమించింది. ముగ్గురు సభ్యుల్లో ఒకరు జస్టిస్ కనగరాజ్. దీనికి రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నీలం సంజీవరెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి 1999లో పదవీ విరమణ అయ్యారు. ఆయన వయస్సు ఇప్పుడు 84 ఏళ్లు ఉంటుంది. ఆయన్ను తీసుకువచ్చి ఈ పీడీ యాక్ట్ సలహా మండలికి అధ్యక్షులుగా పదవి ఇచ్చారు. ఇందులో ఇద్దరు కమిటీ సభ్యులుగా ఉండగా ఒకరు జస్టిస్ కనగరాజ్, మరొకరు జస్టిస్ దుర్గాప్రసాద్. కనగరాజ్ వయస్సు 74 సంవత్సరాలు, దుర్గాప్రసాద్ వయస్సు 70 సంవత్సరాలు. వీళ్లు ముగ్గురు హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పని చేసిన అనుభవం ఉంది కాబట్టి పీడీ యాక్ట్ కింద నమోదు చేసిన కేసులను వాళ్లకు ఉన్న అనుభవంతో, న్యాయ నిపుణతతో పరిశీలించి వాళ్లపై కేసు నమోదు కరెక్టా కాదా, వారిపై ఆ కేసు కొనసాగించాలా వద్దా అనేది తేలుస్తారు. ఈ కమిటీ ఏర్పాటు ఉద్దేశం కరేక్టే. సమంజసమే. ఎందుకంటే కలెక్టర్లు ఇష్టానుసారంగా పీడీ యాక్ట్ కేసులు ఓపెన్ చేస్తే వాటిని ఉంచాలా తీసేయాలా అనేది నిర్ణయించేందుకు ఒక కమిటీ ఉంటే మంచిదే. కాకపోతే ఆ కమిటీలో వేసిన సభ్యుల నియామకంపైనే సందేహం. ప్రస్తుతానికి అయితే ఎటువంటి అభ్యంతరాలు ఏమీలేవు. ఎవరైనా దీనిపై పట్టుబట్టి లిటిగేషన్ లేవనెత్తి కోర్టులో పిటిషన్ వేస్తే చెప్పేలేము కానీ ప్రస్తుతానికైతే ఇబ్బందులు లేవు. కమిటీ నియమాలకు అనుగుణంగానే ప్రభుత్వం వీళ్లను నియమించింది.

 

న్యాయపరమైన చిక్కులు రాకపోతే ఈ పదవి సేఫ్

ఇక జస్టిస్ కనగరాజు విషయం అందరికీ తెలుసు. గతంలో ఎస్ఈసీ  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా తొలగించి, రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఆయన స్థానంగా కనగరాజ్ ను నియమించింది. అయితే ఆయన నియామకం హైకోర్టులో, సుప్రీం కోర్టులో నిలవలేదు. దీంతో ఆయన ఎస్ఈసీ పదవి మూనాళ్ల ముచ్చట అయ్యింది. ఆ తరువాత ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైయింట్స్ అధారిటీకి కనగరాజ్ ను చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే ఈ పదవికి 65 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారే చైర్మన్ గా ఉండాలన్న నిబంధన ఉండటంతో ఆ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో జగన్ సర్కార్ ఆయనకు ఇచ్చిన రెండు పదవులు పోయాయి. ఇప్పుడు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం మూడవ పదవి ఇచ్చింది. ఇది మాత్రం ఆయనకు పూర్తి స్థాయి పదవిగా ఉండవచ్చు, న్యాయపరమైన చిక్కులు ఏమీ రాకపోతే..!


Share

Related posts

Lock Down: సత్ఫలితాలు ఇస్తున్న లాక్‌డౌన్..! అక్కడ మరో వారం పొడిగింపు..!!

somaraju sharma

KGF : కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ రాజమౌళి ని మించుతాడా..?

GRK

అమెరికా మాల్‌లో బాలివుడ్ ఫ్లాష్ మాబ్

somaraju sharma