NewsOrbit
5th ఎస్టేట్

“మహా నటుడు” సినిమా తీసేయచ్చు అయ్యా మోడీ నీ మీద 

 

కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించగానే బిజెపి మద్దతుదారులు అంతా ఆహా…. ఓహో.. అని ప్రభుత్వాన్ని ఒక రేంజ్ లో ఎత్తేసారు. అయితే మోడీ ఆ ప్రకటన చేసిన మరునాడే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక్కరోజులో వివిధ రకాల ప్రయోజనాలను వెల్లడించవచ్చు కానీ దాని వల్ల తమ పార్టీకి లభించే ప్రచారం ఒక్క రోజు తోనే ఆగిపోతుంది. ఇలా సీరియల్ తరహాలో ఒక్కొక్కటిగా వెల్లడించడం వల్ల ప్రభుత్వ పథకాల పై చర్చ జరిగి మైలేజీ గరిష్టస్థాయిలో లభిస్తుంది.

సరే ఎలాగోలాగా వాటిని స్పష్టంగా వెల్లడించినా పర్వాలేదు కానీ ఆర్థిక సహాయం? ఎంత అప్పు రూపాలు ఎంత? అన్న విషయంపై నిర్దిష్టమైన స్పష్టత లేకుండా చాలా తెలివిగా వ్యవహరించడం పైన ఇప్పుడు విపరీతమైన చర్చ నెలకొంది. ప్యాకేజీ మొత్తం కేంద్ర సాయం కాదు…. రుణ సదుపాయం మాత్రమే అని ఎప్పుడో అర్థమైంది. ఆ అంశాన్ని విడదీసి చెప్పడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించకుండా నగదు లభ్యత ను నగదు పంపిణీ గా ప్రజలు భావించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

దీని వెనుక ఉన్నా అజెండా ఒక్కటే…. కష్టకాలంలో కనీసం అప్పు లభించినా చాలనుకునే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇక కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లు ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని డబ్బు కోణంలోనే చూస్తోంది. ప్రజలకు విద్య వైద్యం అందించి వారి కాళ్లపై వారు నిలబడేందుకు దోహదపడటం వంటి పనులు చేయడం ఎప్పుడో మానేసింది. ప్రజలు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వంపై ఆధారపడేలా పరిస్థితిని మార్చి వేస్తున్నాయి.. తద్వారా తాము అధికారంలో ఉన్నన్ని రోజులే మీకు మేలు జరుగుతుంది అన్న భావనను కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి..  లాక్ వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు.

ఎన్నికలు జరుగుతున్న సమయంలో అవసరానికి మించి నగదు పంపిణీ చేయడంతో ఇప్పుడు వచ్చిన క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం దగ్గర నిధులు ఉండటం లేదు. ఇక కరోనా వంటి అసాధారణ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కుదేలు అయిపోయేది మధ్యతరగతి వర్గం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంక్షేమం పేరిట చేస్తున్న చేస్తున్న విచ్చలవిడి వ్యయానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కాబట్టి ఈ సమయంలో మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు ఏ రూపంలో నిధులు దొరక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు మరియు చోటా ఉద్యోగాలు చేసుకొనే వారు విపరీతంగా దెబ్బతిన్నారు.

కానీ ఇవన్నీ తెలియనట్లు తమ 20 లక్షల కోట్ల రూపాయలతో ఇప్పుడు దేశం మొత్తం నడుస్తుంది అన్నట్లు మోడీ చేసిన ప్రకటన ఇప్పుడు అతను ఎంత పెద్ద నటుడో అందరికీ తెలియజేస్తుంది. గట్టిగా మాట్లాడితే 20 లక్షల కోట్ల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వంపై నేరుగా పడే భారం నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుందని అంచనా. కాబట్టి మోడీ ఇకనైనా తన సాధారణ ప్రదర్శనను ఆపి ప్రజలకు జరుగుతున్న పరిస్థితులను గురించి వివరంగా తెలపడం మంచిది.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment