Animal: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన “యానిమల్” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. డిసెంబర్ మొదటి తారీకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా.. అన్నిచోట్ల హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో విడుదలైన మొదటి వారంలోనే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఓవరాల్ కలెక్షన్స్ పరంగా కచ్చితంగా ₹1000 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. హీరో రణబీర్ కపూర్ నట విశ్వరూపం చూపించారు. తండ్రి కొడుకుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ నటించారు. ఈ సినిమాలో అన్ని పాత్రలు విజయానికి చాలా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా విలన్ బాబి డియోల్ పాత్ర అర్బర్ ఎంట్రీ అందరినీ ఆకట్టుకుంది.
విలన్ ఎంట్రీ సమయంలో “జమాల్…జమాల్” అనే సాంగ్ విపరీతంగా దేశవ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండింగ్ గా నిలిచింది. ఈ క్రమంలో సినిమా యూనిట్ “జమాల్…జమాల్” ఫుల్ సాంగ్ విడుదల చేయడం జరిగింది. ఈ సాంగ్ కి చాలామంది రీల్స్ చేస్తూ ఆనంద పడుతున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో విలన్ ఎంట్రీని ఈ రీతిగా ఎంజాయ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని చాలామంది సినిమా ప్రేక్షకులు ఈ పాట పట్ల కామెంట్లు చేస్తున్నారు. విలన్ పాత్రకి బాబి డియోల్.. సరైన న్యాయం చేశాడు. హీరోకి పోటా పోటీగా.. వెండి తెర పై చెలరేగిపోయాడు. ఈ క్రమంలో విలన్ పాదయాత్ర కాస్త ఎక్కువగా ఉంటే బాగుండేది అన్న రీతిలో ప్రేక్షకులకు ఫీల్ కలిగించాడు.
“యానిమల్” సినిమా విజయం సాధించడంలో.. బాబి డియోల్ కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన హిట్ లేక నార్త్ ప్రేక్షకులు ఎంతగానో తల్లడిల్లిపోయారు. కానీ ఈ ఏడాది షారుక్ ఖాన్ రెండు సినిమాలు జవాన్, పటాన్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు యానిమల్ ఆ రెండు సినిమాలకు మంచి విజయం సాధించడంతో ఈ ఏడాది.. బాలీవుడ్ కాస్త తెరుకున్నట్లు అయింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!