Salaar Release Trailer Telugu: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” మొదటి భాగం ఫస్ట్ ట్రైలర్ డిసెంబర్ మొదటి తారీకు విడుదల కావడం తెలిసిందే. కాగా నేడు డిసెంబర్ 18వ తారీకు రెండో ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. మొదటి ట్రైలర్ లో హీరో ప్రభాస్… పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రాణ స్నేహితులని చూపించడం జరిగింది. కాగా నేడు విడుదలైన సెకండ్ ట్రైలర్ లో.. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బద్ధ శత్రువులైనట్లు తెలియజేయడం జరిగింది. మొదటి భాగం ట్రైలర్ లో 3 నిమిషాల 47సెకండ్ల నిడివి ఉండగా సెకండ్ ట్రైలర్ లో… 2 నిమిషాల 54 సెకండ్లు ఉంది. మొదటి ట్రైలర్ లో స్టోరీ తెలియజేయగా రెండో ట్రైలర్ లో… పృధ్వీరాజ్.. ప్రభాస్ మధ్య వైరం చూపించడం జరిగింది.
మొదటి ట్రైలర్ లో కేవలం ఒక నిమిషం మాత్రమే ప్రభాస్ కనిపించాడు. ఈ రెండో ట్రైలర్ లో… ఫుల్ లెన్త్ లో కనిపించడం జరిగింది. ఇదే సమయంలో హీరోయిన్ శృతిహాసన్ నీ కూడా చూపించారు. సినిమాలో మెకానిక్ గా ప్రభాస్ కనిపిస్తున్నాడు. చాలా బలమైన స్టోరీతో కూడుకున్న… యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. “KGF” సినిమాలతో ప్రశాంత్ నీల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.
“బాహుబలి”తో భారతదేశ చలనచిత్ర రికార్డులన్నీ ప్రభాస్ పగలగొట్టడంతో.. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించటంతో దేశవ్యాప్తంగా “సలార్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది. విడుదలైన రెండు ట్రైలర్ లు సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. మొదటి ట్రైలర్ ప్రభాస్, పృధ్వీరాజ్.. ప్రాణ స్నేహితులు అన్ని రెండో ట్రైలర్ బద్ధ శత్రువులని.. తెలియజేయడంతో సినిమాపై మరింతగా ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది.