Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ “సలార్ పార్ట్ 1 – సీజ్ఫైర్” ఈనెల 22వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ప్రభాస్ స్నేహితుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఇంకా జగపతిబాబు పలువురు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు.. కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ మొదటి తారీకు “సలార్ పార్ట్ 1 – సీజ్ఫైర్” ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 3 నిమిషాల 41 సెకండ్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ట్రైలర్ లో సినిమా స్టోరీ చెప్పేయటం జరిగింది. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో.. ఈ సినిమా తెరకెక్కడం జరిగింది.
ట్రైలర్ చివరి నిమిషంలో ప్రభాస్ ని చూపించారు. చాలా పవర్ ఫుల్ గా వైలెంట్ పాత్ర ప్రభాస్ చేసినట్లు తెలుస్తోంది. వరుస పరాజయాలు మీద ఉన్న ప్రభాస్ కచ్చితంగా “సలార్ పార్ట్ 1 – సీజ్ఫైర్” తో హిట్ ట్రాక్ ఎక్కుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన “కేజిఎఫ్” రెండు సినిమాలు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఆ సినిమాతో యాష్ కి ఓవర్ నైట్ లోనే దేశవ్యాప్తంగా మార్కెట్ క్రియేట్ అయింది. సో ఆల్రెడీ ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ కలిగిన హీరో. దీంతో “సలార్ పార్ట్ 1 – సీజ్ఫైర్” ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఇంకా పది రోజులలో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో.. డిసెంబర్ 13వ తారీకు రేపటినుండి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. దీనిలో భాగంగా డిసెంబర్ 13వ తారీకు సినిమాలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. ఇందుకు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే మొదటి ట్రైలర్ లో కేవలం ప్రభాస్ నిమిషం మాత్రమే కనబడటంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఈ వారంలో మరో ట్రైలర్ రిలీజ్ చేయాలని.. అందులో పూర్తిగా ప్రభాస్ క్యారెక్టర్ చూపించాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.