అత్యంత కీలక నిర్ణయం తో మళ్లీ తెరమీదకు వచ్చిన ముద్రగడ

కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మొండిఘటం.! ఒక్కసారి డిసైడ్ అయితే ఇంకెవరూ ఆయనను మార్చలేరు. ఒక్కసారి కమిట్ అయితే ఆయన తనమాట తనే వినడు.

mudragada came with a sensational decission
mudragada came with a sensational decission

తన గౌరవానికి భంగం కలిగిందని మంత్రి పదవినే తృణప్రాయంగా వదిలేసి మూటా ముల్లె సర్దుకొని కిర్లంపూడి విచ్చేసిన చరిత్ర ఆయనది. చాలాకాలం కాపు ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఉధృతంగా ఆందోళనలు చేశారు.చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర కూడా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయన పట్ల చాలా అగౌరవంగా వ్యవహరించింది. అన్ని అవమానాలను ఆయన దిగమి౦గారు.అయితే సొంత సామాజిక వర్గీయులే ఆయనపై విమర్శలు ఆరోపణలు చేయడంతో ముద్రగడ కాపు ఉద్యమ కాడెను కిందపడేశారు.ఇది జరిగి రెండు మూడు నెలలవుతోంది.

ముద్రగడ ఈ ఉద్యమం నుంచి తప్పుకోవడంతో తాను ఆ బాధ్యతలను నిర్వర్తిస్తానంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ముందుకొచ్చారు. ఇందుకు కొందరితో కలిసి సమన్వయ కమిటీ కూడా వేశారు.అయితే హరిరామజోగయ్య వయసుతో పాటు గతంలో ఆయన పోకడలను దృష్టిలో పెట్టుకుని ఏపీ కాపు నేతలు ఆయన నాయకత్వాన్ని అంగీకరించలేదు.అంతటితో ఆగకుండా వారందరూ కట్టకట్టుకుని ముద్రగడ ముద్రగడ పద్మనాభం వద్దకు వెళ్లి మీరే కకాపు ఉద్యమానికి తిరిగి నాయకత్వం వహించాలని కోరారు.అయితే అక్కడున్నది ముద్రగడ పద్మనాభం కదా ! ససేమిరా అన్నారట.అంతేకాదు తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలకు నేతృత్వం వహించలేనంటూ ఓ లేఖ ఇచ్చాడు.

ఇక తనను ఇబ్బంది పెట్టవద్దని అభ్యర్థించాడు. దీంతో చేసేది లేక ఆ నేతలు తిరుగుముఖ౦ పట్టారు.అయితే ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి నాయకత్వం వహించలేనని చెప్పిన విషయాన్ని వారు దాచేసి ఆయనే తమ నాయకుడంటూ మీడియా ప్రశ్నలను దాటేశారు.అయితే తెరవెనుక జరిగిన అసలు విషయం అదంటూ ముద్రగడ సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి.ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కాపు ఉద్యమానికి నాయకుడు అంటూ లేకుండా పొయ్యాడు.ఈ లోటును భర్తీ చేసేది ఎవరు ఎప్పుడు అన్నదే కాపు జాతికి సమాధానం దొరకని ప్రశ్నగా తయారయింది !