NewsOrbit
Entertainment News సినిమా

SuperStarKrishna: ఆ నాటి సూపర్ స్టార్ కృష్ణ సాహసాలే.. ఈనాటి టాలీవుడ్ ఇండస్ట్రీ కీర్తి.. కిరీటాలు..!!

SuperStarKrishna: ఒకప్పుడు దేశంలోనే దక్షిణాది సినిమా రంగంలో టాలీవుడ్ కి పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బాలీవుడ్ గురించి మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే మొదటిగా తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇటీవల బాహుబలి, RRR, పుష్ప సినిమాలు సృష్టించిన రికార్డులు దాటికి ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ గిరాకీ పెరిగింది. వరల్డ్ వైడ్ గా ఓ వెలుగు వెలుగుతున్న తెలుగు చలనచిత్ర సీమలో… మొదటిగా అనేక సంచలనాలకు ఆద్యం పోసింది సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.

Adventures of superstar Krishna those days Today's Tollywood industry fame crowns
Krishna

అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ సాహసాలే.. ఈనాటి టాలీవుడ్ ఇండస్ట్రీ కీర్తి కిరీటాలు. ఆయనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కలర్ సినిమా పరిచయం చేయడం జరిగింది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త టెక్నాలజీ పరిచయం చేయటంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. టెక్నికల్ గా తెలుగు సినిమా ప్రతిష్ట పెంచడంలో ప్రయోగాలు చేయటంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా సాహసోపేతంగా కృష్ణ అనేక సినిమాలు చేయడం జరిగింది. తెలుగులో మొదటి కౌబాయ్ మరియు జేమ్స్ బాండ్ హీరో కృష్ణ. ఆయన నటించిన తొలి చిత్రం ‘తేనెమనసులు’ ఫస్ట్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ సోషల్‌ చిత్రం. ఇంకా టాలీవుడ్ ఇండస్ట్రీలో.. తొలి జేమ్స్‌బాండ్‌ చిత్రం ‘గూఢచారి 116’, తొలి కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్ళకు మోసగాడు’, తొలి తెలుగు సినిమా స్కోప్‌ ‘అల్లూరి సీతారామరాజు’, తొలి తెలుగు 70ఎంఎం సినిమా ‘సింహాసనం’, తొలి ఓ.ఆర్‌.డబ్ల్యు రంగుల చిత్రం ‘గూడుపుఠాణి’, తొలి ప్యూజీ రంగుల చిత్రం ‘భలే దొంగలు’, తొలి సినిమా స్కోప్‌ టెక్నో విజన్‌ చిత్రం ‘దొంగల దోపిడి’, తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’.

Adventures of superstar Krishna those days Today's Tollywood industry fame crowns
Krishna

ప్రస్తుతం తెలుగు సినిమా రంగం స్థాయి టెక్నికల్ గా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుందంటే  దానికి ముఖ్య కారణం కృష్ణ అని చెప్పటంలో సందేహం లేదు. ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి… తెలుగు సినిమా రంగాన్ని అన్ని రకాలుగా పైకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఒక్కో ఏడాది దాదాపు 20 సినిమాలు చేస్తూ రోజుకి 6 షూటింగ్ లలో అప్పట్లో పాల్గొనే వారట. దీంతో కృష్ణని నిర్మాతల హీరో అని కూడా ఇందుస్త్రీలో పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఈరోజు తెలుగు సినిమా రంగం గొప్పదనం ఇంకా టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటుంది అంటే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలే టాలీవుడ్ కీర్తికి పునాదులు. తెలుగు సినిమా రంగాన్ని పైకి తీసుకురావడంలో.. కృష్ణ చేసిన సాహసాలు మరియు ప్రయోగాలు ఇండస్ట్రీలో మరో హీరో చేయలేదు. సమకాలిక తోటి హీరోలు తమ పాపులారిటీ క్రేజ్ గురించి.. సినిమాలు చేస్తే ఒక కృష్ణ .. మాత్రం ఇండస్ట్రీని పైకి తీసుకొచ్చే రీతిలో.. పనిచేసేవారు.

Adventures of superstar Krishna those days Today's Tollywood industry fame crowns
Adventures of superstar Krishna those days Today’s Tollywood industry fame crowns

ఈ రకంగా సినిమా పరంగా చాలామంది తోటి హీరోలకు మంచి పోటీ ఇస్తూ సక్సెస్ఫుల్ కెరియర్ తో దూసుకుపోతూ కూతురు పేరిట పద్మాలయ స్టూడియో నిర్మించడం జరిగింది. కృష్ణ చలనచిత్ర రంగంలో అనేక సినిమాలు విజయం సాధించగా అల్లూరి సీతారామరాజు అతిపెద్ద విజయం సాధించింది. అప్పట్లో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా… కృష్ణని అభివర్ణించేవాళ్లు. ఎంతటి పోటీకైనా దిగటానికి రెడీ అయ్యేవాళ్ళు. కృష్ణ చలనచిత్ర రంగంలో అనేక సినిమాలు విజయం సాధించగా “అల్లూరి సీతారామరాజు” అతిపెద్ద విజయం సాధించింది. దాదాపు కెరియర్ మొత్తంగా 350కి పైగా సినిమాలు చేసిన కృష్ణకి  ప్రస్తుతం హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు భగవంతునికి ప్రార్థనలు చేస్తున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri