Prabhas: వేణు స్వామి అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. అడగకపోయినా కూడా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వేణు స్వామి పాపులర్ అయ్యాడు. యాదృచ్ఛికంగా అతను చెప్పిన వాటిలో కొన్ని నిజం కావడం, రష్మిక మందన్నా, డింపుల్ హయాతి వంటి హీరోయిన్లు ఆయన్ను ఇంటికి పిలిపించుకుని ప్రత్యేకంగా పూజలు చేయించుకోవడంతో వేణు స్వామికి తెలుగు రాష్ట్రాల్లో మరింత క్రేజ్ ఏర్పడింది. అలాగే వేణు స్వామికి యాంటీ ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు. ముఖ్యంగా వేణు స్వామి మరియు ప్రభాస్ అభిమానులకు అస్సలు పడదు. ప్రభాస్ పై వేణు స్వామి చేసే కామెంట్సే అందుకు కారణం.
జాతకం ప్రకారం ప్రభాస్ కు పెళ్లి జరిగే యోగం లేదని, ప్రభాస్ కెరీర్ ఆఖరి దశకు చేరుకుందంటూ ఎప్పటికప్పుడు వేణు స్వామి చేసే చెత్త కామెంట్స్ అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతుంటాయి. ఫ్యాన్స్ ఎంత తిట్టినా కూడా వేణు స్వామి ప్రభాస్‌ను టార్గెట్ చేయడం మాత్రం మానుకోలేదు. అయితే వేణు స్వామి ప్రభాస్ పై నెగటివ్ గా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటే.. ఆయన భార్య వీణ శ్రీవాణి తాజాగా డార్లింగ్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ను పంపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
వీణ శ్రీవాణిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేణు స్వామి జాతకాలు చెప్పి పాపులర్ అయితే.. ఆయన సతీమణి వీణ శ్రీవాణి వీణపై స్వరాలు పలికిస్తూ తన టాలెంట్ ద్వారా లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను వీణతో ఎంతో మధురంగా వాయించడం శ్రీ వాణి ప్రత్యేకత. ఆంధ్ర ప్రాంతంలో పూర్తి సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో శ్రీవాణి జన్మించింది. ఆమె అసలు పేరు సత్యవాణి. వేణు స్వామిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అనంతరం శ్రీవాణిగా మారింది. అభిమానులు ఆమెకు వీణ శ్రీవాణిగా నామకరణం చేశారు. తన అద్భుతమైన నైపుణ్యంతో శ్రీవాణి సినిమా పరిశ్రమలో వీణ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా శ్రీవాణి ప్రభాస్ కు ఒక ప్రత్యేకమైన కానుకను పంపించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో పండిన సీతాఫలాలు చూపిస్తూ.. ఇవన్నీ మన డార్లింగ్ ప్రభాస్ కు పంపుతున్నట్లు శ్రీవాణి తెలిపింది. `ప్రతి ఏడాది మా దగ్గర పండిన సీతాఫలాలు కొంతమందికి పంపిస్తాము. అలా ఓ స్పెషల్ వ్యక్తికి సీతాఫలాలు పంపగా.. అవి ఆయన దగ్గర్నుంచి ప్రభాస్ కు వెళ్లాయి. ప్రభాస్ కి మా సీతాఫలాలు బాగా నచ్చి ఇంకొన్ని కావాలని అడిగారు.
అందుకే ఈ సీతాఫలాలన్నీ ప్రభాస్ గారికి పంపిస్తున్నాను. దాంతో పాటు మా గుర్తుగా ఓ హ్యాండ్ మేడ్ బ్యాగ్ కూడా పంపిస్తున్నాను. వచ్చే సీజన్ లో కూడా మళ్లీ కచ్చితంగా ప్రభాస్‌కు సీతాఫలాలు పంపుతాను` శ్రీవాణి వీడియోలో తెలిపింది. ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో ప్రభాస్ ఫ్యాన్స్ శ్రీవాణి చేసిన పనికి ఫిదా అవుతున్నారు.
https://www.instagram.com/reel/C5ay4tOR0vL/?utm_source=ig_web_copy_link