Ram Charan: “RRR” తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇమేజ్ ఒక్కసారిగా దేశంలో.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే. “RRR” చూసిన హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు రామ్ చరణ్ తో సినిమా చేయడానికి కూడా అప్పట్లో ప్రయత్నాలు చేయడం జరిగింది. “RRR” ప్రాజెక్టులో నటించిన ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా ఒక ఇమేజ్ ఏర్పడింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకులు కూడా రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఎప్పటినుండో వెయిట్ చేసే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బాలీవుడ్ లో టాప్ మోస్ట్ దర్శకుడిగా పేరు ఉన్న సంజయ్ లీలా బన్సాలి.. చరణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని గత కొన్ని వారాల నుండి వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా బాలీవుడ్ మీడియా కూడా ఇదే రకమైన వార్తలు ప్రసారం చేస్తూ ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ప్రాజెక్టు కన్ఫర్మ్ అయినట్లు పిరియాడికల్ వార్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. గతంలో ఇదే తరహాలో రామ్ చరణ్ తన సెకండ్ సినిమా రాజమౌళితో “మగధీర” చేయటం జరిగింది. యుద్ధ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. రామ్ చరణ్ కి మంచి ఇమేజ్ తీసుకురావడం జరిగింది. ఈ సినిమాలో చరణ్ 100 మందితో ఫైట్ చేసే సీన్ తో పాటు గుర్రపు స్వారీ చేయటం.. సినిమాలో స్టెప్పులు అన్నీ కూడా మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. చరణ్ కెరియర్ లో “మగధీర” ఆల్ టైం హిట్ గా నిలిచింది.
కాగా ఇప్పుడు అదే తరహాలో పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ యుద్ధ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీల బన్సాలి… చరణ్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చేస్తుండగానే మరోపక్క బుచ్చిబాబు సినిమా మార్చి నెల నుండి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత సంజయ్ లీల బన్శాలి ప్రాజెక్ట్ చరణ్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.